Telangana Covid Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు.. హైదరాబాద్‌లో అత్యధికం

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో(448) పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27వేల 249 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 562 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 329 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 616 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. మరో ఊరటనిచ్చే అంశం.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..

రాష్ట్రంలో నేటివరకు 8,07,134 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 97వేల 911 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల మార్క్ ను దాటడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 112కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 22వేల 601 కరోనా టెస్టులు చేయగా.. 448 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Booster Dose: బూస్టర్ డోసు కాల పరిమితి తగ్గించిన కేంద్రం.. ఇకపై ఆరు నెలలే!

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు