Telangana Corona Report News : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 544 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 886 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Corona Report News)

Telangana Corona Report News : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 107 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 76 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 55 పాజిటివ్ కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 49 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 544 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 886 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 547 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం రాత్రి కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 10వేల 940 కరోనా పరీక్షలు నిర్వహించగా 49 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Corona Report News)

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలసత్వం వహించకూడదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కొవిడ్ కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమెరికా, ఉత్తర కొరియా, జర్మనీలో నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయని.. మన దేశంలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయని.. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివీటీ రేటు పెద్దగా లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మంత్రి సూచించారు. గుంపులు, గుంపులుగా తిరగొద్దన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి పీహెచ్‌సీలు, బస్తీ ఆసుపత్రులు సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కచ్చితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకొని అవసరమైన ఔషధాలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ పక్కాగా జరిగేలా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పని చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది చాలా బాగా పని చేశారని, అదే స్ఫూర్తితో ఈసారి కూడా అప్రమత్తంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుదాం అని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

అటు దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముందురోజు 4వేలకు పైగా నమోదైన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గాయి. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

శుక్రవారం 4.45 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3వేల 962 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 0.89 శాతంగా ఉంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మరోరోజు రెండు వేలకుపైగా కేసులొచ్చాయి. ఈ రెండింటితో పాటు తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండంపై కేంద్రం ఆయా ప్రభుత్వాలకు హెచ్చరికలు చేసింది.

స్థానికంగా ఇన్‌ఫెక్షన్‌ విస్తరించడమే అందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడింది. అందువల్ల వెంటనే అప్రమత్తమై కట్టడి చర్యలు తీసుకొని ఇప్పటివరకూ దక్కిన ప్రయోజనాలు చేజారకుండా చూసుకోవాలని సూచించింది.

Covid booster : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

కొత్త కేసుల ప్రభావం యాక్టివ్ కేసులపై పడుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 22వేల 416 (0.05 శాతం)కి పెరిగింది. 24 గంటల వ్యవధిలో మరో 2వేల 697 మంది కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో మరో 26 మంది కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. 2020 ప్రారంభం నుంచి 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందిపైగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. 5.24 లక్షలకు పైగా కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇక నిన్న 11.67 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 193 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు