Adipurush : అప్డేట్ అవ్వండిరా అంటారు.. అప్డేట్ అయినా ట్రోల్ చేస్తారు.. ఆదిపురుష్ డిస్ట్రిబ్యూటర్!

ఆదిపురుష్ సినిమా పై చేస్తున్న ట్రోల్స్ అండ్ విమర్శల పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి పిల్లలకు హాలీవుడ్ సూపర్ హీరోస్ తెలుసు. కానీ మన..

TG Vishwa Prasad comments on Prabhas Adipurush trolls

Prabhas Adipurush : ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించారు. కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపించింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. గత శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో రామ జయం, రఘురామ జయం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు.

Adipurush : ఆదిపురుష్ పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కామెంట్స్.. ప్రజల విశ్వాసాలను దెబ్బతియ్యడం..

ఈ ఈవెంట్ లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. “ఆదిపురుష్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని మా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది. నైజాంలో దాదాపు 500 స్క్రీన్స్ కి పైగా సినిమాను రిలీజ్ చేశాం. యూత్ అంతా ఒక అంచనాతో సినిమాకు వచ్చారు. కానీ 20 ఏళ్లలోపు పిల్లలంతా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్, ఓ రౌత్ చేసిన ప్రయత్నం వృధా అవ్వలేదు, సక్సెస్ అయ్యిందని చెప్పాలి” అని వ్యాఖ్యానించారు.

Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఆక్వామ్యాన్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్.. మీరు గమనించారా..?

వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “నిన్నటి వరకు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ సభను రామకోటి ఉత్సవంగా పిలవాలని అనుకున్నాం. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ అనుకున్నది ఏంటంటే.. రామనామాన్ని ప్రతి గడపకు చేర్చాలని. ఆ ప్రయత్నంలో మేము సఫలీకృతం అయ్యాం. ట్రోల్ చేసేవారు కూడా పరోక్షంగా రాముడిని తలుచుకుంటున్నారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లన్నీ సరికొత్త రికార్డులు సృష్టించాయి. మంచి ప్రయత్నానికి తప్పకుండా ప్రజల సహకారం ఉంటుందని ఈ సినిమా విజయం నిరూపించింది. ఇప్పటి పిల్లలకు హాలీవుడ్ సూపర్ హీరోస్ తెలుసు. కానీ మన జాంబవంతుడు, అంగదుడు వంటి పౌరాణిక వీరులు తెలియదు. ఇవాళ మా చిత్రం ద్వారా పిల్లలు వారిని గురించి తెలుసుకుంటున్నారు. ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ అవ్వండిరా అని మీరే అంటారు. అప్డేట్ అయితే మళ్ళీ మీరే ట్రోల్ చేస్తారు” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు