B V S N Prasad : నాడు ప్రజారాజ్యం.. నేడు జనసేన.. సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి పవన్ ఆహ్వానం!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మళ్ళీ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ప్రధాన కార్యకర్తగా..

tollywood Producer B V S N Prasad joins Pawan Kalyan Janasena Party

B V S N Prasad : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మళ్ళీ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ ని స్థాపించి.. టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుతో ‘డ్రైవర్ బాబు’ సినిమాని తెరకెక్కించి నిర్మాతగా కెరీర్ ని స్టార్ట్ చేశారు ప్రసాద్. ఆ తరువాత ప్రభాస్ తో (Prabhas) ఛత్రపతి, రామ్ చరణ్ తో (Ram Charan) మగధీర, పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. ఇది ఇలా ఉంటే.. ఈ నిర్మాత రాజకీయ రంగంలో కూడా కొన్నాళ్ళు ప్రయాణం చేశారు.

Manoj Manchu : ఆదిపురుష్ సినిమాని వారికి ఫ్రీగా చూపిస్తానంటున్న‌ మంచు మ‌నోజ్.. ఎవ‌రికో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం అందరికి తెలిసిందే. ఆ పార్టీ తరుపున పోటీ చేయకపోయినప్పటికీ.. కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారు. చిరంజీవి వెంట పార్టీ ఉన్నంత కాలం నడుస్తూ వచ్చారు. ఇక ప్రజారాజ్యం విలీనం అనంతరం పూర్తిగా మళ్ళీ సినిమా రంగంలోనే బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ రాజకీయం వైపు చూపు తిప్పారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన (Janasena) పార్టీలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌ నేడు అధికారికంగా జాయిన్ అయ్యారు.

Raviteja Eagle : స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రవితేజ ఈగల్.. టైటిల్ టీజర్ అదిరిపోయింది!

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి బీవీఎస్ఎన్ ప్రసాద్ ని పవన్ ఆహ్వానించారు. అయితే ప్రసాద్ ఈసారి కూడా పార్టీ కార్యకర్తగానే ఉంటారా? లేదా ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రసాద్ ఇటీవలే ‘విరూపాక్ష’ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో (Varun Tej) గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు