US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

భారత్‌ పట్ల పూర్తిస్థాయిలో సానుకూల వైఖరి చూపించడం లేదు కమలా హారిస్.

యూఎస్‌ ప్రెసిడెంట్‌ పోల్స్‌ను కీన్‌గా అబ్జర్‌ చేస్తోంది భారత్‌. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతోన్న ఎన్నికల సమరం భారత్‌లో ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగుతోన్న యూఎస్ అధ్యక్ష రేసు భారత్‌నే కాదు..ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగానే ఉంటారు. అక్కడ సెటిల్‌ అయినవారు చాలా మందే ఉన్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. అగ్రరాజ్యంలో ఇండియన్ అమెరికన్స్ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనే మనోళ్లు రేసులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతోన్న కమలా హారిస్‌ తమిళనాడు మూలాలన్న వ్యక్తి.

జోబైడెన్‌ తప్పుకోవడంతో ఆమే అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం ఉంది. రిపబ్లికన్ పార్టీ తరఫున తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయడం ఖాయమైంది. అక్కడ ఏ పార్టీ గెలిచిన మనోళ్ల ప్రాతినిధ్యం అయితే ఉంటుంది. కానీ అమెరికాలో ఏ పార్టీ గెలిస్తే మనకు ప్రయోజనం అన్నదే చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు మూలాలున్న వ్యక్తి
జోబైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్‌ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమలా హారిస్‌ తల్లి తమిళనాడు మూలాలున్న వ్యక్తి. ఆమె తండ్రి మాత్రం జమైకాకు చెందినవాడు. అయితే తన భారతీయ మూలాలపై చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు కమలా హారిస్‌. డెమొక్రాటిక్‌ పార్టీ విధానాలో లేక ఆమె వ్యక్తిగత వైఖరో తెలియదు కానీ.. భారత్‌ పట్ల పూర్తిస్థాయిలో సానుకూల వైఖరి చూపించడం లేదు కమలా హారిస్.

యూఎస్‌ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైమ్‌లోనూ ఇండియాకు రాలేదు కమలా హారిస్. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారామె. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించినప్పటికీ.. కశ్మీర్ విషయంలో కమలా హారిస్‌ చేసిన కామెంట్స్‌ మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్నాయి.

కశ్మీర్‌పై మోదీ విధానాలను విమర్శించిన హారిస్.. 370 ఆర్టికల్‌ రద్దును తప్పుబట్టారు. కశ్మీరీలు ఒంటరిగా లేరని కూడా చెప్పుకొచ్చారు. ఇండియన్ మూలాలు ఉన్న ఆమె కశ్మీర్ విషయంలో పాక్‌కు అనుకూలంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు నాయకులు తమ తమ దేశాలలో రాజకీయ ర్యాలీలలో ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఇండియన్ అమెరికన్లతో హౌడీ మోడీ ఈవెంట్‌ను నిర్వహించారు ట్రంప్. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అపూర్వస్వాగతం లభించింది. లక్షలాదిమంది ఇండియన్స్‌ను ఉద్దేశించిన ప్రసంగించారు మోదీ.

2020లో నమస్తే ట్రంప్
మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 2020లో నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం కోసం పర్యటించారు ట్రంప్. అహ్మదాబాద్‌లో దాదాపు లక్ష మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన తర్వాత ఈ ఇద్దరి నేతల మధ్య బంధాలు బలపడినట్లు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అప్పటి నుంచి మోదీపై ట్రంప్‌కు సానుకూల వైఖరి ఏర్పడిందని అంటున్నారు. అందుకే భారత్‌ స్వతంత్ర దౌత్య విధానంపై ట్రంప్ అసంతృప్తిగా లేరన్న చర్చ ఉంది.

ట్రంప్‌తో మోదీ దోస్తీ ఇలా ఉంటే.. అమెరికా గడ్డపై ఓ సిక్కు కార్యకర్త హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ కౌగిలించుకోవడం అమెరికాకు చిరాకు తెప్పించాయి. ఈ రెండు అంశాలు అమెరికా, భారత్‌ మధ్య కాస్త గ్యాప్ క్రియేట్ చేశాయన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో యూఎస్‌లో ఎవరు గెలిచినా..అమెరికా-భారత్ సంబంధాలు పటిష్టం అయ్యే నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

Also Read: సై అంటే సై.. వరంగల్‌లో పతాక స్థాయికి ఎమ్మెల్యే‌, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్‌..!

ట్రెండింగ్ వార్తలు