నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ సిరీస్ చూసి.. అందులోని పాత్ర పేర్లతో అచ్చం అలాగే చేసి.. రూ.150 కోట్లు కొట్టేసి..

ఆ ముగ్గురు లగ్జరీ హోటల్స్‌లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడ్డారు.

నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ సిరీస్ చూసి.. అందులోని పాత్ర పేర్లతో అచ్చం అలాగే చేసి.. రూ.150 కోట్లు కొట్టేసి..

Updated On : November 6, 2025 / 7:57 AM IST

Crime News: ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ సిరీస్ చూసి ముగ్గురు యువకులు అచ్చం అలాగే చేసి, ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడి రూ.150 కోట్లు చోరీ చేశారు. నేరస్థులు ఎంతో కాలం తప్పించుకుని తిరగలేరు. చివరకు వారిని పోలీసులు అరెస్టు చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లో మనీ హీస్ట్ వెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ చాలా పాపులర్‌. ఆ సిరీస్‌లోని క్యారెక్టర్ల పేర్లను తమ పేర్లుగా పెట్టుకున్నారు ముగ్గురు నిందితులు. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వందల గ్రూప్‌లను క్రియేట్ చేశారు. (Crime News)

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి టిప్స్‌ ఇస్తామని, పెట్టుబడిగా పెట్టిన డబ్బును రెట్టింపు చేసే సూచనలు చేస్తామని నమ్మబలికారు. కొన్ని వందల మంది దీన్ని నమ్మి డబ్బు సమర్పించుకున్నారు.

Also Read: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 1 ఓటింగ్ షురూ.. ఓటర్లకు మోదీ కీలక సూచన

వారు క్రియేట్‌ చేసిన గ్రూపుల్లో వందలాది మంది లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. మొదట పెట్టుబడి పెట్టిన వారి ఖాతాల్లో నేరస్థులు కొంత డబ్బు వేసేశారు. దీంతో ఆ నేరస్థులపై నమ్మకం కలిగేది. అనంతరం జనాలు అధిక మొత్తంలో డబ్బు వేసేవారు.

ఇలా అధిక మొత్తంలో డబ్బు రాగానే వాళ్ల అకౌంట్లను సైబర్‌ నేరస్థులు బ్లాక్ చేసేవారు. ఆ ముగ్గురు యువకులు ఇలా మొత్తం రూ.150 కోట్లు తీసుకున్నారు. అంతేకాదు, ఆన్‌లైన్‌లోనే బిజినెస్ చేయొచ్చంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా మరో రూ.23 కోట్ల వరకు దోచుకున్నారు.

ఆ ముగ్గురు లగ్జరీ హోటల్స్‌లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడ్డారు. వీరి వెనుక చైనా సైబర్ మాఫియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురిని ఢిల్లీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసి వివరాలు తెలిపారు. ఆ ముగ్గురు నిందితుల పేర్లు ప్రభాత్, అర్పిత్, అబ్బాస్ అని తెలిపారు.