బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 1 ఓటింగ్ షురూ.. ఓటర్లకు మోదీ కీలక సూచన
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Bihar elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 1 ఓటింగ్ ప్రారంభమైంది. 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 3.75 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాల్లో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఈ దశలో 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించనున్నారు. వీరిలో ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. (Bihar elections)
ఈ దశ పోలింగ్ మహాఘట్‌బంధన్‌కు ముఖ్యమైంది. 2020 ఎన్నికల్లో వీరు ఆ స్థానాల్లో 63 స్థానాలు గెలిచారు. బీజేపీ, జనతా దళ్ (యూనైటెడ్) కలిపి 55 స్థానాలు సాధించాయి.
ఓటర్లకు మోదీ పిలుపు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటర్లు అందరూ బయలుదేరి ఉత్సాహంగా ఓటు వేయాలని అన్నారు. “నేడు బిహార్‌లో ప్రజాస్వామ్య పండుగ తొలి దశ. ఈ దశలోని ఓట్లు వేస్తున్నవారందరికీ నా పిలుపు ఇదే.. పూర్తి ఉత్సాహంతో ఓటు వేయండి. తొలిసారి ఓటు వేయబోతున్న నా యువ మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు” అని ప్రధాని మోదీ పోస్టులో తెలిపారు.
#WATCH | #BiharElection2025 | A security personnel helps an elderly woman in coming to the polling booth, as she arrives here to cast her vote in the first phase of the Assembly polls.
Visuals from Lakhanpur of Tarapur constituency. pic.twitter.com/E6bZUy560v
— ANI (@ANI) November 6, 2025
