KCR-Kishan Reddy : మోదీ పాలనపై చర్చించేందుకు సిద్ధం..కేసీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి

ప్రధాని మోడీ పాలనలో దేశానికి ఏడేళ్లలో ఏంచేసింది?అంశంపై కేసీఆర్ బహిరంగ సవాల్ ను నేను కేంద్ర ప్రభుత్వం తరపున స్వీకరిస్తున్నానని..చర్చకు నేను సిద్ధం అని కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.

Minister Kishan Reddy has ready to discuss with the KCR : ప్రధాని మోడీ పాలనలో దేశానికి ఏడేళ్లలో ఏంచేసింది?బీజేపీది మతపిచ్చి పాలన తప్ప దేశానికి చేసిందేమీ లేదని..దీనిపై బీజేపీ చర్చకు సిద్ధమా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.కేసీఆర్ సవాల్ పై తెలంగాణ బీజేపీ నేత, కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ బహిరంగ సవాల్ ను నేను కేంద్ర ప్రభుత్వం తరపున స్వీకరిస్తున్నానని..కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. ప్రధానికిగా మోడీ అధికారంలోకి వచ్చిన ఏడు సంవత్సరాల్లో ఏం చేసిందో అనే అంశంపై నేను చర్చకు సిద్ధం అని కేసీఆర్ చర్చకు ఎక్కడకు రమ్మంటారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రతి సవాలు విసిరారు.

Also read : Kishan Reddy: కేసీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నియంతగా ఎవరు వ్యవహరించినా ప్రజలు సహించరనే విషయాన్ని కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ నిజాంల పాలన కొనసాగించాలని… తను,తన తరవాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు అధికారంలో ఉండాలని అనుకుంటున్నారన్నారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 7 ఏళ్లలో ఏమి చేసిందో చర్చించేందుకు సిద్ధం. సీఎం సవాల్ స్వీకరిస్తున్నా అని అన్నారు.

అసెంబ్లీ ముందు అమరవీరుల సాక్షిగా కేసీఆర్ తో చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని..కేంద్రం తరపున నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ కు కుటుంబం మాత్రమే ముఖ్యం. కానీ బీజేపీకి అదికాదు మా పార్టీకి దేశమే ముఖ్యం అని స్పష్టంచేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్ పై నిర్ణయాలు అన్నీ కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే జరుగుతాయని అని ఎద్దేవా చేశారు.

Also read : MLA Raja Singh : బీజేపీకి ఓటు వేయకపోతే వారి ఇళ్లమీదకు బుల్ డోజర్లు పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

జేపీ నడ్డా తరువాత బీజేపీ అధ్యక్షులుగా ఎవరు అవుతారో చెప్పలేమని కానీ టీఆర్ఎస్ కు మాత్రం కేసీఆర్ తరువా కేటీఆర్ మాత్రమే అధ్యక్షులవుతారని కేసీఆర్ కుటుంబ రాజకీయాలకు ఇదే నిదర్శనమని అన్నారు. రైతులు వాడుకునే కరెంట్ మోటార్ కు మీటర్లకు ప్రధాని మోడీ మీటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి..ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తటంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారని..కానీ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదని కిషన్ రెడ్డి అన్నారు.

కరెంట్ మోటర్లుకు మీటర్లు పెట్టాలనే ఆలోచనే కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. రైతులు పంటలకు వాడుకునే యూరియాకు 100 శాతం సబ్సిటీ కేంద్రమే ఇస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే త్వరలోనే ప్రధాని నరేంద్రం మోడీ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు.తెలంగాణలో హుజురాబాద్ ఎన్నికల ఫలితాల నుంచి సీఎం కేసీఆర్ తీరులో ఆందోళనతో కూడిన మార్పు వచ్చిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  “సర్జికల్ స్ట్రైక్స్” పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు.

దాడికి గురైన ఉగ్రవాద సంస్థలే దాడి జరిగినట్లు అంగీకరించాయని, ఈ విషయాన్ని యావత్ ప్రపంచం అంగీకరించిన కేసీఆర్ అంగీకరించకపోవడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల వీరమరణాన్ని శంకిస్తూ, సైనికుల కుటుంబాల మనోభావాలు బెద్దతిసే విదంగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభినందన్ అనే యుద్ధవీరుడు పాకిస్తాన్ సైన్యానికి పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే మాటలు పాకిస్తాన్ దేశం కూడా మాట్లాడదని కిషన్ రెడ్డి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు