Pawan Kalyan : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. అప్పుడు 5 వేలు.. ఇప్పుడు 50 కోట్లు..

ఇంతటి స్టార్‌డమ్, వందల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న పవన్, కెరీర్ స్టార్టింగ్‌లో ఒక సినిమాకి నెలకు కేవలం 5 వేల రూపాయలు జీతం తీసుకున్నారు అంటే నమ్మగలమా..?

Pawan Kalyan: టాలీవుడ్‌లో హీరోలందరిదీ ఒక రూటు అయితే.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ది సపరేట్ రూటు.. ఆయన క్రేజ్ గురించి, ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి వెళ్లినా.. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా క్రేజ్ కొండెక్కి కూర్చుందే తప్ప కొంచెం కూడా తగ్గలేదు. అదీ పవర్‌స్టార్ స్టామినా..

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

ఆయనతో సినిమా చెయ్యడానికి దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ పోటీ పడుతుంటారు.. ఒక్క ఛాన్స్ అంటూ ఆయన పక్కన నటించాలని ఆర్టిస్టులు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇంతటి స్టార్‌డమ్, వందల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న పవన్ కెరీర్ స్టార్టింగ్‌లో ఒక సినిమాకి నెలకు కేవలం 5 వేల రూపాయలు జీతం తీసుకున్నారు అంటే నమ్మగలమా..?

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

అవును.. నిజమే.. ఇంటర్మీడియట్ తర్వాత తనకిష్టమైన మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుని కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు కళ్యాణ్. తర్వాత వదిన ప్రోత్సాహంతో నటనలో ట్రైనింగ్ పూర్తి చేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కళ్యాణ్‌ని హీరోగా పరిచయం చెయ్యడానికి ముందుకొచ్చారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన పవన్ ఫస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’..

ఈ సినిమా ప్రమోషన్స్ కానీ పవన్ చేసిన మార్షల్ ఆర్ట్స్ కానీ అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ మూవీ ద్వారానే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. అయితే పవన్ ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’.. షూటింగ్ టైం లో కొద్ది కాలం పాటు నెలకు ఐదు వేల రూపాయలు జీతంగా తీసుకున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లగ్జీరియస్ కార్.. కాస్ట్ ఎంతంటే..!

 

కట్ చేస్తే ఇప్పుడు ఒక్క సినిమాకే నిర్మాతలు ఆయనకు అక్షరాలా 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. పవన్ స్టామినాకి ఇంకా ఎక్కువిచ్చినా పర్లేదు అనే దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. సినిమా సినిమాకి ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్‌డమ్ పెంచుకుంటూ.. క్రేజ్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్..

ట్రెండింగ్ వార్తలు