Vegetable Seeds Cultivation : రైతు స్థాయిలో కూరగాయల విత్తనోత్పత్తిలో మెళకువలు

రైతుల తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే, విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావాల్సిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన్సీ నుండే పొందాలి. రశీదును భద్రపరచుకోవాలి.

Vegetable Seeds Cultivation : విజయవతంమైన పంట ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైనది విత్తనం. సాగులో ఎనలేని ప్రాధాన్యత విత్తనానిది. నాణ్యమైన విత్తనమే సాగులో అధిక దిగుబడికి, ఆదాయం రాబడికి పునాది అని చెప్పుకోవచ్చు. నాణ్యమైన విత్తనం నాటితే, సగం దిగుబడి సాధించినట్లే అన్నది ఆర్యోక్తి. కూరగాయల పంటల సాగులో కూడా విత్తనం ప్రాధాన్యత ఎక్కువే. ఉత్పత్తి, ఖర్చులలో మరీ ఎక్కువ పాళ్లు తీసుకోనప్పటికి, ఎరువులు, సాగునీరు, సస్యరక్షణ మందులు, శుద్ధి విధానాలు వంటి ఇతర ఉత్పత్తి కారకాల వాడుక సామర్థ్యం, విత్తనంపైనే ఉంటుంది.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

అలాంటి నాణ్యమైన విత్తనాన్ని రైతు స్థాయిలో తయారు చేసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పంట దిగుబడి, మార్కెట్ లో పంటకు డిమాండ్, లాభాలు మొదలైన అంశాలన్ని, మనం విత్తిన విత్తన నాణ్యత మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి పంట ఉత్పాదకత పెంపుదలలో నాణ్యమైన విత్తనం కీలకమైనది.

వివిధ పంటలలో, ఇతర ఉత్పాదకత అంశాలను పరిశీలిస్తే, కేవలం నాణ్యమైన విత్తనం వాడకం ద్వారానే 15 నుంచి 20 శాతం అధిక దిగుబడులను సాధించవచ్చని పరిశోధనల ద్వారా రుజువైనది. విత్తన నాణ్యత ఎన్నో అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ జన్యుపరమైన, యాజమాన్యపరమైన కారణాలు విత్తన నాణ్యతను కాపాడటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.

READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !

సాధారణంగా విత్తనాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ధృవీకరణ విత్తనం అయితే, రెండువది ట్రూత్‌ఫుల్లీ లేబెల్డ్‌ విత్తనం. అయితే విత్తనం చట్టం ప్రకారం దేశంలో విక్రయానికి ఉంచబడిన ప్రతి విత్తనం, కచ్చితంగా లేబిల్ ఉండాలి. అంటే విత్తన వివరాలతో కూడిన సమాచారం అన్నమాట. ధృవీకరణ ఉన్నా లేకున్నా లేబిల్ మాత్రం ఉండాల్సిందే.

ధృవీకరణకు విత్తనోత్పత్తిదారుడు విత్తన క్షేత్రాన్ని ముందుగా నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని అంశాల్లో సంతృప్తి చెందిన తర్వాత లేబిల్‌ మంజూరు చేయటం జరుగుతుంది. ట్రూత్‌పుల్లీ లేబెల్డ్‌ విత్తనాల ఉత్పత్తిని ఆయా విత్తిన సంస్థలే పర్యవేక్షించుకుంటాయి. ధృవీవకరణ విత్తనాలకు నీలి రంగు లేబిల్‌, ట్రూత్‌ఫుల్లీ లేబెల్డ్‌ విత్తానాలకు ఆకు పచ్చ రంగు లేబిల్‌ ఉంటుంది. ఉత్పత్తి చేసిన విత్తనాన్ని పంటను బట్టి కొంత కాలం వరకు నిల్వచేసుకొని సాగుకు వాడుకోవచ్చు.

READ ALSO : Sugarcane Farming : చెరకు సాగులో ఎరువుల యాజమాన్యం

విత్తనోత్పత్తికి సంకర రకాలు వద్దు ; 

రైతుల తమ స్థాయిలో విత్తనోత్పత్తికి సంకర రకాలను ఎన్నుకోరాదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన రకాల్లో మాత్రమే, విత్తనోత్పత్తి చేపట్టాలి. అందుకు కావాల్సిన విత్తనాన్ని సంబంధిత బ్రీడరు లేదా సదరు సంస్థ లేదా అధీకృత ఏజెన్సీ నుండే పొందాలి. రశీదును భద్రపరచుకోవాలి. విత్తనోత్పత్తికి ముందుగానే క్షేత్రంలో వేర్పాటు దూరం, మురుగునీరు పోయే సౌకర్యాలను నిర్ధారించుకోవాలి. అప్పుడే మేలైన విత్తనోత్పత్తి సాధ్యమవుతోంది.

విత్తనోత్పత్తికి తెలంగాణ అత్యంత అనులకూమైనవి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 25 శాతం భూములు విత్తన క్షేత్రాలుగా మారాయి.  రాష్ట్రంలో సాగువుతున్న కూరగాయల్లో టమాటను ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఈ పంటనే సాగుచేస్తుంటారు. తమకు కావాల్సిన విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వీలుంది. విత్తన సేకరణకు బాగా ఎరుపుగా పండిన పంట పండ్లను మాత్రమే ఎంచుకోవాలి.

READ ALSO : Groundnut Bug And stem Fly : మినుము, పెసర పంటలో శనగపచ్చ పురుగు, కాండపు ఈగ నివారణ!

ఇతర సూటి రకాల విత్తనోత్పత్తికి ఎంచుకోవడం మేలు ; 

అలాగే వంగ పంటలో కూడా సూటి రకాలలో రైతులు సొంతంగా తమ స్థాయిలో,  విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. ప్రసుత్తం రంగును బట్టి, ఆకారాన్ని బట్టి పలు సూటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు బెండ ఉష్ణ మండలపు పంట, వేడితో కూడిన వేసవిలో బాగా వస్తున్నప్పటికీ, వెచ్చని తేమతో కూడిన కాలంలో కూడా పంట వస్తుంది. విత్తనోత్పత్తికి శంఖు రోగాన్ని తట్టుకునే సూటి రకాలను ఎంచుకోవాలి. పూసా సవాని, పంజాబ్‌ పద్మిని, ఫర్భని క్రాంతి రాష్ట్రంలో సాగు చేసే ఇతర సూటి రకాల విత్తనోత్పత్తికి ఎంచుకోవడం మేలు.

READ ALSO : Pests in Rice : వరిపంటకు తీవ్రనష్టం కలిగిస్తున్న తెగుళ్లు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

తీగజాతి కూరగాయలల్లో విత్తనోత్పత్తి ముఖ్యమైనది. తెలంగాణ రాష్ట్రంలో సోర,బీర, దొండ, పొట్లతో పాటు పచ్చిదోస, కూరదోస, బూడిద గుమ్మడి వంటి రకాలు సాగువుతున్నాయి. రైతులు తర్వాత పంటగా వేసుకోవటానికి లేదా ట్రూత్‌పుల్లీ లేబెల్డ్‌ విత్తనాలుగా అమ్మేందుకు సొంతంగా విత్తునోత్పత్తి చేపటవచ్చు. విత్తనాల కోసం కోతకు బాగా పండి పండ్లను మాత్రమే సేకరించాలి.సేకరించిన పంటలను ఎండ బెట్టాలి. ఆతర్వాత ఒక వైపు రంద్రం చేయాలి. విత్తనాలు సేకరించాలి. పోట్ల, బీరలలో విత్తనం సేకరించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు