CM Jagan : సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సభలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.

CM Jagan Election Campaign : మరో వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేస్తూ.. మరోసారి అధికారంలోకివస్తే చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నారు. అయితే, ఆదివారం ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్.. సోమవారం మూడు నియోజకవర్గాల్లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభల్లో పాల్గోనున్నారు.

Also Read : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అంటే ఏంటి? దీనిపై రచ్చ దేనికి? ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు

వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ (సోమవారం) మూడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. ఉదయం 10గంటలకు బాపట్లకు చేరుకోనున్న జగన్.. అంబేద్కర్ విగ్రహం సెంటర్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్ లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. జగన్ మోహన్ రెడ్డి సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో సభా స్థలివద్ద ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు