IPL 2024 : బాల్ బాయ్ సూపర్ క్యాచ్.. జాంటీ రోడ్స్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

మ్యాచ్ సమయంలో లక్నో బ్యాటర్ స్టాయినిస్ కొట్టి సిక్స్ ను బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Jonty Rhodes : ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాత్రి (మే 5) లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 235 పరుగులు చేసింది. 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో తడబడింది. 16.1 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కేకేఆర్ జట్టు 98 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నోపై భారీ విజయంతో కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ సమయంలో లక్నో బ్యాటర్ స్టాయినిస్ కొట్టి సిక్స్ ను బౌండరీ లైన్ బయట ఉన్న బాల్ బాయ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read : IPL 2024 : పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన కోల్‌కతా.. మూడో ప్లేస్ లో సునీల్ నరైన్

లక్నో బ్యాటింగ్ సమయంలో మూడో ఓవర్లోని ఐదో బంతిని కేకేఆర్ జట్టు బౌలర్ వైభవ్ అరోరా షార్ట్ బాల్ వేశాడు. క్రీజులో ఉన్న స్టాయినిస్ వికెట్ల వెనుక నుంచి సిక్స్ కొట్టాడు. ఆ బాల్ బౌండరీ లైన్ బయటపడే సమయంలో వేగంగా వచ్చిన బాల్ బాయ్ క్యాచ్ అందుకున్నాడు.

 

బాల్ బాయ్ క్యాచ్ అందుకోవడంతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. డగౌట్ లో ఉన్న జాంటీ రోడ్స్ బౌండరీ బయట క్యాచ్ అందుకున్న బాల్ బాయ్ ను చప్పట్లు కొడుతూ అభినందించారు. అతని సంజ్ఞతో ఆటోగ్రాఫ్ అడిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాల్ బాయ్ ను అభినందిస్తున్నారు. దీనికితోడు బాల్ బాయ్ ను కామెంటేటర్స్ కూడా అభినందించారు.

Also Read : IPL 2024 : సొంతగడ్డపై లక్నో చిత్తు.. 98 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి కేకేఆర్

 

ట్రెండింగ్ వార్తలు