IPL 2024 : సొంతగడ్డపై లక్నో చిత్తు.. 98 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి కేకేఆర్

LSG vs KKR : ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

IPL 2024 : సొంతగడ్డపై లక్నో చిత్తు.. 98 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి కేకేఆర్

KKR Vs LSG ( Image Credit : @IPL_Twitter/ Google)

LSG vs KKR : కోల్‌కతా అదరగొట్టింది. సొంతగడ్డపై లక్నోను చిత్తుగా ఓడించింది. ఐపీఎల్ 2024లో భాగంగా మే 5న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 236 భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో తడబడింది. 16.1 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 137 పరుగులకే ఆలౌట్ అయింది.

Read Also : IPL 2024: ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవరెవరు ఉన్నారో తెలుసా? అగ్రస్థానంలో ఆర్సీబీ ప్లేయర్

టాప్ స్కోరరుగా స్లోయినీస్ :
లక్నో ప్లేయర్ మార్కస్ స్టోయినీస్ (36) టాప్ స్కోరరుగా నిలవగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (25) పరుగులతో రాణించాడు. కోల్‌కతా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మిగతా ఆటగాళ్లలో అష్టన్ టర్నర్ (16), ఆయుష్ బదోని (15), నికోలస్ పూరన్ (10) దీపక్ హఉడా (5), అర్షిన్ కులకర్ణి (9), కృనాల్ పాండ్యా (5), యధ్వీర్ సింగ్ (7), రవి బిష్ణోయ్ (2) పరుగులకే చేతులేత్తేశారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకోగా, ఆండ్రీ రస్సెల్ 2 వికెట్లు, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీసుకున్నారు.

చెలరేగిన సునీల్ నరైన్ :
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (32)పరుగులకే చేతులేత్తేయగా, సునీల్ నరైన్ (81; 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించాడు. కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చిన సునీల్ నరైన్ (81/39, 1/22)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అంగ్ర్కిష్ రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23), రమణదీప్ సింగ్ (25 నాటౌట్), రింకూ సింగ్ (16), ఆండ్రీ రస్సెల్ (12), వెంకటేష్ అయ్యర్ (1నాటౌట్) పరుగులతో రాణించారు. ఫలితంగా కోల్‌కతా 236 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నోకు నిర్దేశించింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీసుకోగా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ ప్లేసులోకి కోల్‌కతా :
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.  ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 3 ఓడి 16 పాయింట్లతో టాప్ 1 ప్లేసులో నిలవగా, లక్నో జట్టు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 5 ఓడి 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.

Read Also : PBKS vs CSK: పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం