IPL 2024 : పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన కోల్‌కతా.. మూడో ప్లేస్ లో సునీల్ నరైన్

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన కోల్‌కతా.. మూడో ప్లేస్ లో సునీల్ నరైన్ 39 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు.

IPL 2024 : పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన కోల్‌కతా.. మూడో ప్లేస్ లో సునీల్ నరైన్

IPL 2024

IPL 2024 Points Table : కోల్‌కతా అదరగొట్టింది. సొంతగడ్డపై లక్నోను చిత్తుగా ఓడించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం రాత్రి (మే 5) లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 98 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 235 పరుగులు చేసింది. 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో తడబడింది. 16.1 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 137 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నోపై భారీ విజయంతో కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

Also Read : IPL 2024 : సొంతగడ్డపై లక్నో చిత్తు.. 98 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి కేకేఆర్

కేకేఆర్ జట్టు పాయింట్ల పట్టికలో 16 పాయింట్లు 1.453 రన్ రేట్ తో ప్రథమ స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో 16 పాయింట్లతో 0.622 రన్ రేటుతో రాజస్థాన్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 12 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటికే కేకేఆర్, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ లను ఖరారు చేసుకోగా.. చెన్నై, హైదరాబాద్, లక్నో, ఢిల్లీ జట్లు మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. ఏమైనా అద్భుతాలు జరిగే ఆర్సీబీ జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది.

Also Read : PBKS vs CSK: పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

మరోవైపు ఆరెంజ్ క్యాప్ రేసులో ముగ్గురు ప్లేయర్లు పోటీ పడుతున్నారు. కేకేఆర్ జట్టు బ్యాటర్ సునీల్ నరైన్ లక్నోపై 39 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఆ తరువాత ఆరెంజ్ క్యాప్ రేసులో సునీల్ నరైన్ మూడో స్థానంకు చేరాడు. తొలి స్థానంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ (542)నిలవగా.. రెండో స్థానంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (541), మూడో స్థానంలో నరైన్ (461) నిలిచాడు. మరోవైపు పర్పుల్ క్యాప్ రేసులో జస్ర్పీత్ బుమ్రా, హర్షల్ పటేల్ మధ్య గట్టిపోటీ నెలకొంది. ముంబై ఇండియన్స్ జట్టు ఫాస్ట్ బౌలర్ బుమ్రా 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ 17 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.