Venkaiah Naidu: మరోసారి విశ్వ విజ్ఞాన కేంద్రంగా భారత్: వెంకయ్య నాయుడు

మాతృభాషలో విద్యావిధానం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. సమగ్ర విద్యావిధానం, శాంతియుత వాతావరణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది అని వెంకయ్య అన్నారు.

Venkaiah Naidu: నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ-2020) ద్వారా భారత్ మరోసారి విశ్వ విజ్ఞాన కేంద్రంగా మారగలదని ఆకాంక్షించారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆదివారం జరిగిన ఢిల్లీ విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం వందేళ్లలో సాధించిన ప్రగతిని ఆయన అభినందించారు.

M. Venkaiah Naidu : ఆర్ధిక సహాయం కోరిన ఉపరాష్ట్రపతి ?

‘‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యలో ఉన్న అంతరాలను తొలగించే దిశగా కృషి చేయాలి. జాతి నిర్మాణంలో, ప్రపంచ సమృద్ధిలో విద్యారంగం పోషించే పాత్ర కీలకం. మాతృభాషలో విద్యావిధానం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. సమగ్ర విద్యావిధానం, శాంతియుత వాతావరణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని వెంకయ్య అన్నారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోని పది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ చోటు దక్కించుకునేలా కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ట్రెండింగ్ వార్తలు