Vijay Devarakonda and Mrunal Thakur pair up for Parusuram VD13 Movie
Mrunal Thakur : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) లైగర్(Liger) సినిమాతో కొంచెం గ్యాప్ తీసుకొని ఈ సారి ఆసక్తికర ప్రాజెక్ట్స్ ని పట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం విజయ్, సమంత(Samantha) కాంబోలో శివ నిర్వాణ(Shiva Niravana) దర్శకత్వంలో ఖుషి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత VD12 జెర్సీ(Jersy) డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో విజయ్ స్పై క్యారెక్టర్ చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ఓపెనింగ్ చేశారు.
ఇక విజయ్ దేవరకొండ 13వ సినిమా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. పరుశురాం – విజయ్ దేవరకొండ కాంబోలో గతంలో గీతగోవిందం సినిమా వచ్చి భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుండటంతో దీనిపై కూడా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకుండానే సడెన్ గా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. అంతే కాక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది అని ప్రకటించారు. మృణాల్ కూడా VD13 పూజా కార్యక్రమంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపోయింది. విజయ్ మృణాల్ పై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. విజయ్ – మృణాల్ కాంబోతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక మృణాల్ కూడా సీతారామం సక్సెస్ తో వరుసగా ఆఫర్లు సాధిస్తుంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోను మృణాల్ వరుస సినిమాలు చేస్తుంది.
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023