Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,210కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,960 వద్ద ట్రేడవుతుంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 51,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 55, 960గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: బంగారం అంటే మక్కువ ఉండనివారు ఉండరు. శుభకార్యాలు, పండుగల సమయాల్లో అధికంగా మహిళలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుదలతో దేశంలో వీటి ధరలు అమాంతం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ. 51,450 వద్ద ఉంది. 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ. 56,110 వద్ద కొనసాగుతంది.

Gold Price: రూ.40 తగ్గిన బంగారం ధర.. రూ.100 పెరిగిన వెండి రేటు

దేశంలోని ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,210కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 56,960 వద్ద ట్రేడవుతుంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర 51,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 55, 960గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,350 కాగా, 24 క్యారెట్లు బంగారం ధరం 56,010గా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ దాదాపు బంగారం ధరలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోచూస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,960గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్, వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో పెద్దగా మార్పులేదు.

Gold Price: ‘వన్ ఇండియా.. వన్ గోల్డ్ రేట్’ బంగారం ధరపై కేరళ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిరాష్ట్రంగా గుర్తింపు

బంగారంతో పోలిస్తే వెండి ధరలు కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరనుచూస్తే.. కిలో వెండి రూ. 71,800గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగానే వెండి ధర ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 74,400 పలుకుతుంది. గత రెండురోజుల క్రితం కేజీ వెండి ధరపై ఏకంగా రూ. 900 అదనంగా పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు