Congress party: పీకేకు కాంగ్రెస్‌లో ఏ పదవి ఇవ్వబోతున్నారు? సీనియర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది?

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఆసక్తిని రేపుతుంది. త్వరలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అతన్ని ఏ స్థాయిలో పదవి ఇచ్చి...

Congress party: కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఆసక్తిని రేపుతుంది. త్వరలో పీకే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అతన్ని ఏ స్థాయిలో పదవి ఇచ్చి గౌరవించాలన్న దానిపై కాంగ్రెస్ అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ పలు దఫాలుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతోనూ భేటీ అయ్యారు. గతవారం సోనియాతో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ పలు ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలపై ఏకే ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్ సహా సీనియర్లతో సోనియా గాంధీ ఓ కమిటీని వేసింది. ఆ కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించింది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలా, వ్యూహకర్తగానే ఉండాలా, కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ఏ స్థాయిలో పదవిని అప్పగించాలనే అంశంపై అభిప్రాయాలు సేకరించిన సీనియర్ల కమిటీ నాలుగు పేజీల నివేదికను శుక్రవారం సోనియాకు అందించింది.

Congress party: అధ్యక్షుడిగా రాహుల్ వద్దు.. కాంగ్రెస్‌లో చర్చనియాంశంగా పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రశాంత్ కు ఎలాంటి పదవి ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీనియర్ల బృందం ఇచ్చిన నివేదికలో ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా ఉంచితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, దిగ్విజయ సింగ్ సహా పలువురు నేతలు పీకే కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మేలు జరుగుతుందన్న అభిప్రాయాలను వెలుబుచ్చారు. అయితే మరికొందరు సీనియర్ నేతలు మాత్రం ప్రశాంత్ కిషోర్‌ను సీనియర్ నాయకుడిగా కాకుండా సాధారణ పదవితో పార్టీలో చేర్చుకోవాలని పేర్కొన్నారు.

Congress Party: ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌లో చర్చ.. 72గంటల్లో తుది నివేదిక..

ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ కు కొత్తగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరు సీనియర్ నేతలు మాత్రం సోనియాగాంధీ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ ఉంటే పార్టీకి మేలు జరుగుతుందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు సీనియర్లు మాత్రం గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన అహ్మద్ పటేల్ స్థానంలో కిషోర్‌ను నియమించాలని అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి కట్టబడెతారన్న అంశంపై కాంగ్రెస్ లో జోరుగా చర్చ సాగుతుంది. మరి సోనియాగాంధీ ప్రశాంత్ కిషోర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు