WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ అదిరే అప్‌డేట్.. 5 సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఇవే..!

WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తోంది. చాట్ ట్రాన్స్‌ఫర్, సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్ సహా కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.

WhatsApp rolls out new update for iPhone users _ chat transfer, silence unknown callers and 3 other changes

WhatsApp iPhone Users : ప్రముఖ మెటా (Meta) యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) ఐఫోన్ యూజర్ల కోసం కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో డిజైన్, సెక్యూరిటీని మరింత మెరుగుపరుస్తుంది. వాట్సాప్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ట్రాన్స్‌ఫర్ చాట్స్’ ఫీచర్‌తో పాటు ‘సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్’ వంటి మరిన్ని ఫీచర్లను చేర్చింది. ఈ కొత్త ఫీచర్లన్నీ అందరికీ అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్ క్రమంగా కొత్త అప్‌డేట్‌లను రిలీజ్చేస్తుంది. వాట్సాప్ ఐఫోన్ యూజర్లందరికి అప్‌డేట్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది.

(WhatsApp iOS)లో యాప్ వెర్షన్ 23.14.79ని రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్, సెక్యూరిటీని మెరుగుపరచడానికి ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. iOS యూజర్ల కోసం లేటెస్ట్ వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న 5 సరికొత్త అప్‌డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Flipkart Plus Premium : ఫ్లిప్‌కార్ట్‌‌లో ‘ప్లస్ ప్రీమియం’ మెంబర్‌షిప్.. ఈ కొత్త సర్వీసు పూర్తిగా ఉచితం.. త్వరలో భారత్‌లో లాంచ్..!

ట్రాన్స్‌ఫర్ చాట్స్ (Transfer chats) :
వాట్సాప్ ఇప్పుడు iOS యూజర్ల కోసం పాత ఐఫోన్ నుంచి సరికొత్త ఐఫోన్‌లోకి మెసేజ్‌లు, మీడియా, సెట్టింగ్‌లతో సహా చాట్ హిస్టరీని లోకల్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా వాట్సాప్ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఐక్లౌడ్ లేదా లోకల్ బ్యాకప్‌పై ఆధారపడాల్సిన పనిలేదు. ఈ ఫీచర్ iOS 15, తర్వాతి వెర్షన్ల నుంచి వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులో ఉంది.

రీడిజైన్డ్ స్టిక్కర్ ట్రే (Redesigned sticker tray) :
వాట్సాప్‌లో కొత్త లేఅవుట్‌తో స్టిక్కర్ ట్రేని రీడిజైన్ చేసింది. స్టిక్కర్‌లను కనుగొనడంతో పాటు పంపుకోవచ్చు. ఇప్పుడు యూజర్లు టైప్ చేసేందుకు కీవర్డ్ ద్వారా స్టిక్కర్‌లను కూడా సెర్చ్ చేయొచ్చు.

WhatsApp iPhone Users rolls out new update for iPhone users _ chat transfer, silence unknown callers and 3 other changes

అవతార్ స్టిక్కర్లు (Avatar stickers) :
వాట్సాప్ కొత్త యాక్ససరీస్‌తో సహా కొత్త అవతార్ స్టిక్కర్‌లను చేర్చింది. స్టిక్కర్ ట్రేలోని ‘+’ బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తమ సొంత అవతార్ స్టిక్కర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు సెల్ఫీని క్లిక్ చేసి.. ఆ సెల్ఫీని స్టిక్కర్‌గా మార్చడం ద్వారా కస్టమైజ్డ్ అవతార్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.

ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో వీడియో కాల్స్ (Video calls in landscape mode) :
వాట్సాప్ ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో (WhatsApp) వీడియో కాల్‌లను ఉపయోగించడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఫ్యామిలీతో వీడియో కాల్‌లో ఉన్న ఒకే ఫ్రేమ్‌లో ఒకేసారి ఎక్కువ మంది వ్యక్తులతో మాట్లాడాలనుకునే యూజర్లకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

సైలెన్స్ అన్‌నౌన్ కాలర్స్ (Silence unknown callers) :
వాట్సాప్ iOS యూజర్లు ఇప్పుడు అవాంఛిత కాల్స్ నివారించడానికి గుర్తుతెలియని కాలర్‌లను సైలంట్ చేయవచ్చు. ముఖ్యంగా భారత్‌లో ఆన్‌లైన్ స్కామ్ కేసులు పెరుగుతున్నప్పుడు స్కామ్ కాల్‌లను విస్మరించడానికి ఈ ఫీచర్ ప్రత్యేకంగా సాయపడుతుంది. వాట్సాప్‌లో గుర్తుతెలియని కాలర్‌లను సైలంట్ చేయడానికి యూజర్లు Settings > Privacy > Calls > Silence Unknown Callers ఆప్షన్ ఆన్ చేయొచ్చు.

ముఖ్యంగా, ఐఫోన్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్లన్నీ iOS లేటెస్ట్ వాట్సాప్ అప్‌డేట్‌తో అందుబాటులో ఉన్నాయి. కొత్త అప్‌డేట్‌ కోసం యాప్ స్టోర్‌ని ఓపెన్ చేసి వాట్సాప్‌లోకి వెళ్లాలి. ‘Updates’ ట్యాబ్‌పై Tap చేయండి. మీకు అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. అక్కడ లిస్టు అయినట్టు మీరు చూస్తారు. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసేందుకు ‘Update’పై నొక్కండి.

Read Also : Apple Retail Stores : ఆపిల్ కొత్త రిటైల్ స్టోర్ సర్వీసు.. కస్టమర్లకు ఇకపై ఈజీగా హోం డెలివరీ.. ఎప్పటినుంచంటే?

ట్రెండింగ్ వార్తలు