BCCI Twitter DP : ప్ర‌ధాని పిలుపు.. బ్లూ టిక్ కోల్పోయిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..?

ఆగస్టు 15 దేశ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ క్ర‌మంలో ప్ర‌తీ ఒక్క‌రు త‌మ త‌మ సోష‌ల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్‌ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

BCCI Twitter DP

BCCI Twitter : ఆగస్టు 15 దేశ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day). ఈ క్ర‌మంలో ప్ర‌తీ ఒక్క‌రు త‌మ త‌మ సోష‌ల్ మీడియా డీపీ, ప్రొఫైల్ పిక్స్‌ను మువ్వన్నెల జాతీయ జెండాతో నింపాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi)పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో భాగంగా బీసీసీఐ (BCCI)భారత జెండాను డీపీగా పెట్టుకుంది. భార‌త్‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు బీసీసీఐ త‌న డీపీని మార్చింది. ఆ వెంట‌నే త‌న వెరిఫైడ్ బ్లూ టిక్ ను కోల్పోయింది.

బ్లూ టిక్ లేని బీసీసీఐ ఖాతాను చూసి తొలుత నెటీజ‌న్లు విస్తుపోయారు. అస‌లు విష‌యం తెలుసుకున్న వారు షాక్ అయ్యారు. ఎలాన్ మస్క్ కావాలని ఈ పని చేశాడా అంటే కాద‌ని స‌మాధానం వ‌స్తోంది. జాతీయ జెండాను డీపీగా పెట్టుకోవ‌డం త‌ప్పు కాదు. మ‌రీ బ్లూ టిక్ ఎందుకు ఎగిరిపోయింది అనేగా మీ డౌట్‌. అక్క‌డికే వ‌స్తున్నాం కొంచెం ఆగండి.

WWE Superstar Spectacle : WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌కు సిద్ద‌మైన హైద‌రాబాద్‌.. 28 మంది స్టార్స్‌.. ఎప్పుడు ఎక్క‌డంటే..?

ఎక్స్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా అకౌంట్ డీపీ లేదా ప్రొఫైల్ పిక్ మార్చిన వెంట‌నే స‌ద‌రు అకౌంట్ బ్లూ టిక్ మార్క్ ఎగిరిపోతుంది. ఆ త‌రువాత ఎక్స్ టీమ్ ఆ మార్పును ప‌రిశీలిస్తుంది. రివ్యూ చేసిన త‌రువాత మ‌ళ్లీ బ్లూ టిక్‌ను పున‌రుద్ద‌రిస్తుంది. బీసీసీఐ త‌న డీపీ మార్చ‌డంతో నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్లూ టిక్ పోయింది. అయితే..రివ్యూ తరువాత బ్లూ టిక్ వెనక్కి వచ్చేస్తుంది.

Hardik Pandya: టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు

అయితే.. క‌థ ఇక్క‌డితో ఆగిపోలేదు. బీసీసీఐ మ‌రోసారి త‌న బ్లూ టిక్ కోల్పోయే అవ‌కాశం ఉంది. ఎలాగు బీసీసీకి మ‌ళ్లీ బ్లూ టిక్ మార్క్ వ‌చ్చేస్తుంది. అయితే.. స్వాతంత్య్ర దినోత్సవం వేడుక‌ల అనంత‌రం బీసీసీఐ తిరిగి త‌న పాత ప్రొపైల్ పిక్‌ను ఎంచుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అదే జ‌రిగితే అప్పుడు మ‌రోసారి బీసీసీఐ త‌న బ్లూ టిక్‌ను కోల్పోతుంది. మ‌ళ్లీ ఎక్స్ టీమ్ రివ్య్వూ చేసిన త‌రువాతనే తిరిగి వ‌స్తుంది అన్న సంగ‌తిని గుర్తించుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు