IND Vs WI: వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్… తొలి మ్యాచులో 171 రన్స్ చేసిన జైస్వాల్‌పై రోహిత్ ప్రశంసల జల్లు

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 421/5కి డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం..

IND Vs WI

WI vs IND 1ST Test : వెస్టిండీస్‌ను భారత్ చిత్తు చేసింది. డొమినికాలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టడం, యశస్వి జైస్వాల్‌ (Yasasvi Jaiswal), రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీలు బాదడంతో భారత్ ఇన్నింగ్స్, 141 పరుగులతో విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అనంతరం, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 421/5కి డిక్లేర్ ఇచ్చింది.  రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ మళ్లీ 130 పరుగులకే(50.3 ఓవర్ల వద్ద) ఆలౌట్ అయింది. దీంతో, భారత్ 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (2023–2025 WTC)ను విజయంతో ప్రారంభించింది. మూడు రోజుల్లోనే భారత్ ఆటను ముగించింది.

రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ (28 పరుగులు) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 7, రవీంద్ర జడేజా 2, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఆడిన మొట్టమొదటి టెస్టులోనే 171 పరుగులు చేసి అద్భుతంగా రాణించిన జైస్వాల్ పై ప్రశంసల జల్లుకురుస్తోంది. అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

అతడి గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జైస్వాల్ కు బాగా టాలెంట్ ఉందని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడని గతంలోనే తన ప్రదర్శన ద్వారా జైస్వాల్ స్పష్టం చేశాడని తెలిపాడు. మ్యాచులో చాలా తెలివిగా ఆడాడని చెప్పాడు. మ్యాచులో ఏ దశలోనూ అతడు భయపడలేదని అన్నాడు.

India Tour of South Africa : టీమ్ ఇండియా సౌతాఫ్రికా టూర్.. షెడ్యూల్ విడుద‌ల‌

ట్రెండింగ్ వార్తలు