KGF : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న కేజీఎఫ్ సిరీస్.. RRR ని బీట్ చేస్తుందా..? సలార్ కోసమే రిలీజ్..?

జపాన్ లో కేజీఎఫ్ సిరీస్ ని రిలీజ్ చేస్తున్న నిర్మాతలు. అయితే ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నది సలార్ కోసమని తెలుస్తుంది.

Yash KGF ready to release in japan in july salaar rrr

KGF : 2018 లో కన్నడ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా కేజీఎఫ్-1. ఆ తరువాత 2022 లో వచ్చిన సెకండ్ పార్ట్ ఎంతటి హిట్ అయ్యిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. 1500 కోట్ల వరకు కలెక్షన్ అందుకొని ఇండియన్ టాప్ మూవీగా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా నటించాడు. రాకీ భాయ్ గా యశ్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది.

LGM Trailer : ట్రైలర్ లాంచ్ చేసిన ధోని.. పెళ్ళికి ముందు అత్తని అర్ధం చేసుకోవాలి అంటున్న కోడలు..

ఇక ఇప్పుడు ఈ చిత్రం జపాన్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. జులై 14న కేజీఎఫ్ 1&2 ని ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడడంతో జపనీస్ అభిమానులు కోసం యశ్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు. జపనీస్ కి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన యశ్.. చాలా రోజులు కేజీఎఫ్ ని గుర్తు పెట్టుకుంటారు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా జపాన్ లో RRR ని సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అక్కడ ఎన్నో ఏళ్ళ పాటు ఉన్న రజినీకాంత్ రికార్డుని బ్రేక్ చేయడం బాహుబలి వల్ల కూడా కాలేదు.

Leo : లియోకి గుమ్మడికాయ కొట్టేసిన విజయ్.. టీజర్ అండ్ సాంగ్స్‌తో ప్రమోషన్..

కానీ RRR మాత్రం ఆ రికార్డుని తేలిగ్గా బ్రేక్ చేయడమే కాకుండా కొత్త రికార్డ్స్ సెట్ చేసింది. ఇండియాలో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ పోటీ పడి కలెక్షన్స్ అందుకున్నాయి. దీంతో జపాన్ లో కేజీఎఫ్ ఎటువంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది. RRR ని బీట్ చేయగలదా? అనే చర్చ మొదలైంది. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ వెనుక ఉన్న కారణం సలార్ అని కూడా వినిపిస్తుంది. సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉండబోతుందట. కాబట్టి జపనీస్ ఆడియన్స్ కి సలార్ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి కేజీఎఫ్ ని రిలీజ్ చేస్తున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు