Barley Payasam : శారీరక,మానసిక సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వారానికి ఒకసారి బార్లీ పాయసంతో!

మానసిక ఒత్తిడి, ఆందోళన టెన్షన్, నీరసం వంటివి తగ్గటానికి బార్లీతో తయారు చేసుకున్న పాయసం బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు.

Barley Payasam : సహజసిద్ధంగా లభించే బార్లీలో అనే ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగి ఉంటుంది. బార్లీలో బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగంపై పొట్టులోనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీ గింజలను యధాతథంగా ఉపయోగించాలి. జ్వరంతో నీరసం ఉంటే బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. బార్లీ గింజలతో గంజిని తయారుచేసి, మజ్జిగను, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన టెన్షన్, నీరసం వంటివి తగ్గటానికి బార్లీతో తయారు చేసుకున్న పాయసం బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు. మానసిక , శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందటానికి దీనిని మించింది లేదనే చెప్పాలి.

బార్లీ పాయసం తయారీ విధానం ;

అరకప్పు బార్లీని రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టాలి. తరువాత రోజు ఉదయం పొయ్యి మీద గిన్నె పెట్టి లీటర్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక నానబెట్టిన బార్లీని వేయాలి. 15 నిమిషాల పాటు ఉడికించాలి. దానిలో జీడిపప్పు,బాదం పప్పు,డేట్స్ లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నిమిషం తరువాత పొయ్యి పై నుండి కిందకు దించాలి. కావాలనుకుంటే డేట్స్ ముక్కలు వేసుకోవచ్చు. పంచదార వాడే బదులుగా తియ్యదనం కోసం ఖర్జూరం ఉపయోగిస్తే సరిపోతుంది. మంచి పోషకాలు ఉన్నబార్లీ పాయసాన్ని ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు