Betel Leaf Plant : ఇంట్లో తమలపాకు చెట్టును ఏ దిక్కున పెంచాలో తెలుసా?

తమలపాకును ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా వినియోగిస్తారు.ఈ ఆకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇళ్లలో కూడా చాలామంది తమలపాకు చెట్లు పెంచుతూ ఉంటారు. అయితే ఏ దిశలో వీటిని పెంచాలో తెలుసా?

Betel Leaf Plant

Betel Leaf Plant : తమలపాకు దైవత్యం కలిగిన ఆకు. పూజల్లో తమలపాకు వాడతారు. భోజనం చేసిన తరువాత తాంబూలంలో వాడతారు. తమలపాకులో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను చెక్ పెడతాయి. ఇటీవల కాలంలో చాలామంది తమ ఇళ్లలో తమలపాకు చెట్లను పెంచుతున్నారు. అయితే ఏ దిశలో వీటిని పెంచాలో మీకు తెలుసా?

బరువు తగ్గించే తమలపాకుతో బోలెడు ప్రయోజనాలు

తాంబూలం వేసుకోవడం శరీరానికి ఎంతో ఉపయోగకరమట. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్, సి విటమిన్ తమలపాకులో ఉంటాయి. తాంబూలం వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో పీచు పదార్ధం ఉంటుంది. తమలపాకులో ఉండే చెవికాల్ అనే పదార్ధం శరీరంలో బాక్టీరియాను కట్టడి చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

తమలపాకులో రెండు విరుద్ధ గుణాలు ఉన్నాయి. అవేంటంటే తొడిమ తీసి పాన్ తయారు చేసుకుని తింటారు. ఇలా చేయడం వల్ల వంధ్యత్వం రాకుండా ఉంటుందట. అదే తొడిమతో తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమతో తినకూడదు. బీపీతో బాధపడేవారు తమలపాకు ఎక్కువగా తినకూడదట. తాంబూలం తయారు చేసేటపుడు అందులో సున్నం కలుపుతారు.. అది రక్తనాళాల మీద.. రక్త సరఫరా మీద ప్రభావం చూపిస్తుందట.

Betel Leaf : తమలపాకును తొడిమతో కలిపి ఎందుకు తినకూడదు?

తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనె కలిపి పిల్లలకు నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయట. తమలపాకు వేడి చేసి వాపు నొప్పి ఉన్న కీలు మీద కడితే నొప్పి తగ్గుతుందట. తమలపాకు శ్లేష్మాన్ని కరిగిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుందట. ఇలా తమలపాకులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తమలపాకును ఇంట్లో పెంచుకోవచ్చా? ఏ దిక్కున పెంచుకోవాలి? అంటే..

ఇంట్లో తమలపాకును పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరమట. తమలపాకు రంగు గ్రీన్. బుధుడికి సంకేతం. ఇంట్లో ఈ చెట్టు ఉంటే బిజినెస్‌కి మంచిదట. అయితే ఈ చెట్టుని నార్త్ వైపు  పెంచాలట. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఇంటి దోషాలున్నా, పెళ్లిళ్లు కాకపోయినా, పిల్లలు లేకపోయిన, పూజల్లో, పరిహారాల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా తమలపాకు ఉపయోగపడుతుంది. తమలపాకు చెట్లను సూర్యరశ్మి ఎక్కువగా ఉండే చోట పెంచాలి. మొక్కకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. తమలపాకు మొక్కలు తరచు ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతాయి. ఇంట్లో పెరిగే మొక్కల ఎరువును ప్రతి 20 రోజులకు వీటికి ఆహారంగా పెట్టవచ్చునట. ఈ చెట్లకు అప్పుడప్పుడు ఎర్రటి పురుగులు పడతాయి. వేపనూనెతో పిరికారి చేస్తే వీటి బెడద తగ్గుతుంది. దెబ్బతిన్న ఆకును ఎప్పటికప్పుడు కత్తించించడం ఉత్తమం.

మధుమేహాన్ని అదుపులో ఉంచే తమలపాకు, నల్లజీలకర్ర కషాయం!

ట్రెండింగ్ వార్తలు