Joint Problems : కీళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించే శొంఠిపాలు !

శొంఠి గ్యాస్, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఒక మంచి ఔషధంలా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు శొంఠి పొడి కలిపిన పాలు తాగితే సరిపోతుంది.

Joint Problems : అల్లాన్ని ఎండబెట్టి శొంఠిగా తయారు చేస్తారు. ఈ శొంఠి పొడిని పాలతో కలిపి తీసుకుంటే మేలైన ప్రయోజనాలుంటాయి. వంటింట్లో అందుబాటులో ఉండే దివ్య ఔషధాలతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి దివ్యౌషధాలలో శొంఠి కూడా ఒకటి. శొంఠి పలు అనారోగ్యాలను నయం చేసే సత్తా ఉంది. నాసికంలో కఫము, గొంతులో తెమడ ఎక్కువైనపుడు చాలా మంది అల్లం తీసుకుంటారు. దగ్గు, జలుబు, ఫ్లూ లేదా ఎలాంటి శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తినపుడు అల్లంకు బదులు శొంఠి పాలు తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

రోగనిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారికీ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తరచు వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారికీ కూడా శొంఠి పాలు ఉపశమనం కలుగజేస్తాయి. శొంఠి గ్యాస్, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఒక మంచి ఔషధంలా తోడ్పడుతుంది. రాత్రి పడుకునే ముందు శొంఠి పొడి కలిపిన పాలు తాగితే సరిపోతుంది. ముఖ్యంగా కీళ్లలో సమస్యలు పెరిగినప్పుడు ఈ పాలు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శొంఠి పొడిలో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రక్త హీనత కూడా తగ్గించి రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి.

శొంఠిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబును త్వరితగతిన తగ్గేలా చేస్తుంది.గొంతు సమస్యలను ఎదుర్కొనేవారు శొంఠి పొడిని పాలల్లో కలిపి రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తిన్న ఆహారాన్ని ఆహరం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఉబ్బసం, కడుపు మంట లాంటి సమస్యలు తలెత్తకుండా రక్షణగా తోడ్పడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది బహువిధాలుగా ప్రయోజనాలను కలిగిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రిళ్లు పాలు తాగడం మంచిది. పాలు తాగడం వల్ల ఒత్తిడి, చిరాకు దూరమవుతుంది. కొందరు పాలను ఉదయం తాగితే, మరికొందరు రాత్రుళ్లు తాగుతారు. ఏసమయంలో తాగినా ఆరోగ్యానికి ఒకే రకమైన మేలు కలుగుతుంది. నిద్రపోవడానికి కనీసం గంట లేదా రెండు గంటలకు ముందే పాలు తాగటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు