Parijatha flowers : పారిజాతాలు .. కిందపడినా దోషం అంటని దేవతా పుష్పాలు

తెల్లని పువ్వు మధ్యలో నారింజ రంగును రంగరించి పోసినట్లుగా ఉండే అపురూప పుష్పాలు పారిజాతాలు. కిందపడినా దోషం అంటని పుష్పాలు.

parijat flowers

parijatha flowers : పారిజాత పుష్పాలు. దేవతా పుష్పాలు అంటారు. పారిజాతం చెట్టు దేవతా వృక్షం అని పేరు. పారిజాతం అంటే శ్రీకృష్ణుడికి నారదుడు ఇవ్వటం..ఆ పుష్పం విలువ, గొప్పదనం చెప్పి నీకు ఇష్టమైన భార్యకు ఇవ్వమని చెప్పటం..అప్పుడు కృష్ణుడు రుక్మిణి వద్దే ఉండటంతో రుక్మిణీదేవికే ఇవ్వటం ఆతరువాత కృష్ణుడికి అతి ప్రీతికరమైన భార్య సత్యభామ అలగటం తద్వారా జరిగిన కిట్టయ్య లీలలు గుర్తుకొస్తాయి.

పారిజాతాలతో పాటుమందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం వీటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ చెబుతోంది.

పారిజాత పువ్వుల్ని చూస్తే అలా కళ్లప్పగించి చూస్తుండిపోవాలనిపిస్తుంది. వాటి అందం అలాంటిది. తెల్లని పువ్వు మధ్యలో నారింజ రంగు రంగరించి పోసినట్లుగా ఉండే పారిజాతాలకు దోషం అంటని పుష్పాలు అంటారు. అందుకే సాధారణ పువ్వులు పూజకు కోసే సమయంలో కింద పడితే ఆ పువ్వుల్ని పూజకు ఉపయోగించరు. కానీ పారిజాతాలకు అటువంటి దోషం అంటని పుష్పాలు. ఎందుకంటే అవి దేవతా పుష్పాలు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పాలు. అందుకే పారిజాతాలు కింద పడినా పూజలు ఉపయోగించే అరుదైన,అద్భుతమైన పుష్పాలు.

Bathing : రోజు చేసేదే అయినా .. స్నానాల్లో ఎన్నిరకాలున్నాయో తెలుసా..? స్నానాలకు అర్ధాలు, ఫలితాలు

గుప్పుమని సువాసనలు వెదజల్లే పారిజాత పువ్వులతో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని పండితులు చెబుతారు. రాత్రి సమయంలో పూసి సువాసనల్ని వెదజల్లే ఈ పువ్వుల గొప్పదనమే కాదు..పారిజాత చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. కానీ ఇన్ని విశేషాలు..ఇంత గొప్పదనం కలిగిన పారిజాతాలు రాత్రి సమయంలోనే పూస్తాయి. ఉదయానికల్లా రాలిపోతాయి దీనికి కారణం దేవేంద్రుడి శాపం.

అందుకే రాత్రి పూసి ఉదయానికే రాలిపోయినా పూజకు ఉపయోగించవచ్చట. వీటికి దోషం లేదట.చెట్టుకింద రాలినా వాటి అందం..వాటి సువాసన మాత్రం ఏమాత్రం తగ్గరు. చెట్టుకింద తివాచీ పరిచనట్లుండా పారిజాతాల అందం చూస్తే మనస్సు ఆహ్లాదంతో నిండిపోతుంది.కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి, దేవుడి సేవలో వినియోగిస్తారు. దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఏ దోషమూ ఉండదు.

పారిజాతం మొక్క నాటితే దాన్ని సాధారణ మొక్కల్లాగా వదిలేయకూడదు. ఏదో నీళ్లు పోసాంలే అని వదిలేయకూడదు. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పారిజాతం చెట్టును చుట్టూ అంతే పరిశుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే ఈ చెట్టు నీడన లక్ష్మీదేవి ఉంటుందంటారు. కాబట్టి చెట్టు కింద పేడతో అలికి..చక్కగా ముగ్గులు పెట్టాలి. దానిపై పడిన పూలను దేవుడికి ఉపయోగించాలి. పారిజాతం చెట్టు ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు. పారిజాత పుష్పం వాసనతో మనకు ఆరోగ్యం. వీటి ఆకుల్లో ఉండే ఫ్లావనాయిడ్స్‌ మోకాల్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు మొలలు కూడా తగ్గిపోతాయి. నిఫా వైరస్‌కు కూడా పారిజాతం ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. పారిజాత చెట్టు, ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ గొప్పవే. వీటిలో చాలా ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి.







                                    

ట్రెండింగ్ వార్తలు