Non-Alcoholic Fatty Liver : నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యా? ఎందుకిలా ?

నాన్ ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు , తృణధాన్యాలు , అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు రోజువారిగా తీసుకోవాలి. చక్కెర ఉప్పు, జంతు మాంసాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, మద్యం వంటివి వాటికి దూరంగా ఉండాలి.

Non-Alcoholic Fatty Liver : కాలేయం శరీరంలో ఉండె అతిపెద్ద అవయవం. ఇది కడుపుకి కుడి వైపున పైన భాగంలో పక్కటెముక కింద ఉంటుంది. ఇది మన శరీరం యొక్క పనితీరుకు అవసరమైన ప్రోటీన్లను సంశ్లేషణ చేస్తుంది, రక్తస్రావం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. కాలేయం స్వయంగా రిపేర్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కాలేయంలో ఎక్కువ కొవ్వు ఉండటం అన్నది కాలేయ నష్టానికి దారితీస్తుంది. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడం ఎదురవుతుంది. ఊబకాయం, మధుమేహం ,అధిక కొవ్వు, నరాల రక్తపోటు, నిశ్చల జీవనశైలి, కొన్ని మందుల వాడకం వల్ల ఈపరిస్ధితి ఎదురవుతుంది. ఇటీవలి కాలంలో నాన్ ఆల్కాహాల్ లివర్ ఫాటీ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్య ఉన్నవారిలో అలసట, పొత్తికడుపులో నీరు పేరుకుపోవటం, అన్నవాహిక లో రక్తస్రావం, గందరగోళ పరిస్ధితుల్లో ఉండటం, ఇలాంటి వన్నీ కాలేయం దెబ్బతినటానికి సంకేతాలుగా చెప్పవచ్చు.

నాన్ ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు , తృణధాన్యాలు , అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు రోజువారిగా తీసుకోవాలి. చక్కెర ఉప్పు, జంతు మాంసాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, మద్యం వంటివి వాటికి దూరంగా ఉండాలి. ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా ఉంటే వారానికి ఒక సారి ఉపవాసం చేయవచ్చు.

అధికబరువు ఉంటే వెంటనే బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. రాత్రి ఆహారంగా తేలికపాటి పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. తక్కువ కేలరీలు, తక్కు కొవ్వు ఉండే ఆహారాలు బరువు తగ్గటానికి సహాయపడతాయి. రోజువారిగా అరగంట సమయం తేలిక పాటి వ్యాయామాలకు కేటాయించాలి.

ట్రెండింగ్ వార్తలు