Pinocchio Effect : మీరు అబద్ధం చెబితే మీ ముక్కు చెప్పేస్తుంది

ఎవరైనా అబద్ధం చెబుతున్నారని డౌట్ వచ్చిందా? వాళ్లు మాట్లాడేటపుడు ముక్కు, బాడీ లాంగ్వేజ్ గమనించండి. మీకే అర్ధమైపోతుంది. 'పినోచియో ఎఫెక్ట్'..

Pinocchio Effect : అబద్ధం చెప్పినప్పుడల్లా పినోచియో అనే వాడి ముక్కు పెరిగిపోవడం అనే కథ చిన్నప్పుడు చాలామంది చదువుకుని ఉంటారు. ఇది కల్పితం అని అందరికీ తెలుసు. కానీ అబద్ధం చెప్పినపుడు ఏం జరుగుతుందో పరిశోధన జరిగింది. అదే ది పినోచియో ఎఫెక్ట్. అబద్ధాలు చెప్పినప్పుడు చెప్పే వాళ్ల ముక్కు చుట్టూ.. కంటి లోపల కండరాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయట. థర్మోగ్రాఫర్ సాయంతో దీనిని కనిపెట్టారట.

Laughing Yoga : లాఫింగ్ యోగా అంటే ఏమిటి? దీనిని ఎలా చెయ్యాలి?

అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి అంటారు మనవాళ్లు. అంతలా నమ్మించడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది ఇదిగో ఇలా ముక్కు దగ్గర దొరికిపోతారేమో? విషయం ఏంటంటే అబద్ధం చెప్పినప్పుడు మెదడులో ఇన్సులా అనే మూలకం యాక్టివేట్ అయ్యి ముక్కు చుట్టూ ఉష్ణోగ్రత పెరుగుతుందట. మన శరీర ఉష్ణోగ్రతను గుర్తించడం, కంట్రోల్ చేయడంలో ఈ ఇన్సులా పాల్గొంటుందట.

 

ఎవరైనా అబద్ధం చెబుతున్నప్పుడు ఓసారి వారి బాడీ లాంగ్వేజ్ గమనించండి. నోటిని మూసి వేసి ఉంచుతారట. ముక్కుని, ముఖాన్ని చేతులతో తాకడం లాంటివి చేస్తుంటారట. అబద్ధం చెబుతున్నప్పుడు కాటెకోలమైన్ అనే రసాయనాలు శరీరంలో విడుదలవుతాయట. దీని వల్ల ముక్కులోపల ఉండే కణజాలం ఉబ్బుతుందట. ముక్కు లోపల నరాల చివరలు జలదరిస్తున్నట్లు అవుతాట. దురద కూడా వస్తుందట. అందువల్ల ఎవరైనా అబద్ధం చెబుతుంటే వారు ముక్కుని ముట్టుకోవడం, దురద వస్తున్నట్లు అయ్యి గోకడం వంటివి చేస్తారట.

Date Syrup : డేట్ సిరప్ సహజసిద్ధమైన తీపిని అందించటమే కాదు ఆరోగ్యానికి మేలు చేస్తుంది తెలుసా?

అబద్ధం చెప్పేవారు నిలకడగా నిలబడలేరట. తరచుగా కదులుతు ఉంటారట. అంటే వారిలో భయం చెబుతున్నామనే ఆందోళన అలాంటి పరిస్థితిని కలిగిస్తుంది. నిజాయితీ లేని కారణంగా దొరికిపోతామనే భావన ఈ లక్షణాలకు కారణం కూడా కావచ్చు. పినోచియో ఎఫెక్ట్ నిజమేనని హార్వర్డ్ అధ్యయనం సైతం వెల్లడించింది. అబద్ధాలు చెప్పే వ్యక్తులు నిజం చెప్పే వ్యక్తుల కంటే చాలా తక్కువ పదాల్లో మాట్లాడతారట. తాము చెప్పే మాటలతో ఎదుటివారిని నమ్మించే ప్రయత్నంలో భాగంగా వారు ఇలా చేస్తారని తెలుస్తోంది. ఎవరైనా అబద్ధం చెబుతున్నారని అనిపిస్తే ఓసారి వారి ముక్కు, బాడీ లాంగ్వేజ్ గమనించండి. మీకే అర్ధం అవుతుంది. పినోచియో ఎఫెక్ట్.

ట్రెండింగ్ వార్తలు