Pumpkin Seeds : శరీరానికి పోషకాలనిచ్చే గుమ్మడిగింజలు

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలలో పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి. గుమ్మడికాయ యొక్క చిన్న విత్తనాలు క్యాన్సర్ ,అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. గుమ్మడికాయ గింజలను వేయించుకుని తింటే బలే రుచిగా ఉంటాయి. అలాగే మొలకెత్తిన గుమ్మడికాయ గింజలను తినవచ్చు. గుమ్మడికాయ గింజలను పొడిగా చేసుకుని సలాడ్ లపై చల్లుకుని తినవచ్చు. సూప్, పాస్తా లేదా తీపి వంటలలో గుమ్మడికాయ గింజలను ఉపయోగవచ్చు. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఈ గింజలను తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు,ఎముకల నొప్పి, జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ K,మరియు విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బీటా కెరోటిన్ , భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ,ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా మరియు వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ బి మరియు జింక్ వంటి పోషకాలు ఉంటాయి అలాగే గుమ్మడికాయ విత్తనాల తినడం వల్ల న్యూరోట్రాన్స్మిటర్లను అనే మెదడు రసాయనం ఉత్పత్తి చేసి మెదడు కార్యకలాపాలను మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

గుమ్మడికాయ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉండడంవల్ల గుమ్మడికాయ తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనల్లో తేలింది. అలాగే శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది అదనంగా, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

గుమ్మడికాయ విత్తనంలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను బలోపేతం చేయడానికి మరియు మలబద్దకం వంటి కడుపు సమస్యలను తొలగించడానికి పనిచేస్తుంది అలాగే కడుపు పురుగులను చంపడానికి గుమ్మడికాయ గింజలు సమర్థవంతమైన చికిత్స. శాస్త్రీయ పరిశోధన ప్రకారం, గుమ్మడికాయ విత్తనాలు టేప్‌వార్మ్ ఇన్‌ఫెక్షన్ పై 89 శాతం బాగా పనిచేసి కడుపులో ఉండే పురుగునీ చంపుతుంది.

గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది రోజుకి 100 గా గుమ్మడికాయ గింజలు తింటే మంచి నిద్ర పడుతుంది అలాగే గుమ్మడికాయ గింజల్లో విటమిన్-సి కూడా అధికంగా ఉండడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు రాకుండా చేస్తోంది విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 9 శాతం తగ్గిస్తుంది. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ ,రక్తపోటువాటి సమస్యలు రావు మరియు ఇందులో ఫేబర్ ఎక్కువగా వుండడం వల్ల ఆకలి తక్కువ వేసి శరీర బరువు ని తగిస్తుంది.

కాల్షియం లోపం వలన బోలు ఎముకల వంటి వ్యాధులకు దారితీస్తుంది అదనంగా, శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే ఎముక పగుళ్లు కూడా వస్తాయి గుమ్మడికాయ గింజలలో కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇవి ఎముకలను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల మన శరీరానికి కావలసిన కాల్షియం నీ అందించి ఎముకలని బలంగా చేస్తోంది.

ఒక అధ్యయనం ప్రకారం, గుమ్మడికాయ విత్తనాలలో ఉండే భాస్వరం మూత్రాశయ రాళ్లను కరిగిస్తుంది గుమ్మడికాయ గింజలతో తయారు చేసిన ఆహారాలు ఎక్కువ రోజులు తీసుకుంటే మూత్రాశయంలో ఉండే రాళ్లను కరిగిస్తుంది.

రక్తహీనత అంటే శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నిరోధించడం. శరీరంలో ఇనుము మరియు ఫోలేట్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం దీనికోసం ఇనుము మరియు ఫోలేట్ పోషకాలు ఉన్నా ఆహార్యం తినాలి గుమ్మడికాయ గింజలు ఇక్కడ మీకు సహాయపడతాయి, ఎందుకంటే ఇందులో ఇనుము మరియు ఫోలేట్ పోషకాల ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు