Weight : బరువు సులభంగా తగ్గాలంటే?

బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారం మోతాదు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి అదే పనిగా తినటం మంచిదికాదు.

Weight : బరువు అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. శరీరంలో పేరుకు పోయిన కొవ్వుల కారణంగా చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే బరువును తగ్గించుకోవటం వల్లా ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు. బరువు పెరుగుతున్నట్లు భావించిన సందర్భంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సులభంగా పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ;

ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ; బరువు పెరగకుండా చూడటంలో బ్రేక్ ఫాస్ట్ ప్రధానమైనది. ప్రతిరోజు సరైన సమయానికి బ్రేక్ పాస్ట్ తీసుకోవాలి. రోజు మొత్తానికి అవసరమయ్యే శక్తిని బ్రేక్ ఫాస్ట్ ద్వారా లభించేలా చూసుకోవాలి. చాలా మంది పనివత్తిడులు కారణంగా అసలు బ్రేక్ ఫాస్ట్ చేయటం మానేస్తారు ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది.

సూప్ తరువాత భోజనం ; భోజనానికి ముందు సూప్ తాగటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పొట్ట నిండిన భావన కలిగి భోజనం తక్కువగా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సూప్ గా కూరగాయలను ఉడికించి తయారు చేసుకోవటం మంచిది. దీని వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. అతిగా తినకుండా కంట్రోల్ లో ఉంచేందుకు సూప్ సహాయపడుతుంది.

తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ; బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారం మోతాదు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి అదే పనిగా తినటం మంచిదికాదు. దీని వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారం ప్రతి మూడు గంటలకు ఒకసారి కొద్దికొద్ది మొత్తంగా తీసుకోవాలి. తక్కవ మోతాదులో తీసుకోవటం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గవు. ఆకలి పెంచే హార్మోన్ విడుదలకాకుండా ఉంటుంది.

రాత్రి నిద్రకు ముందు గ్రీన్ టీ ; బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీని తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గించుకోవచ్చు. అయితే దీనిని రాత్రి సమయంలో నిద్రకు ముందుగా తీసుకోవటం మంచిది. రోజుకు మూడు నాలుగు సార్లు గ్రీన్ టీ తాగే బదులు రాత్రి నిద్రకు ముందు తాగటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

తీపి పదార్ధాలకు దూరంగా ; బరువు పెరగటానికి స్వీట్లు కూడా కారణం. తీపి పదార్ధాలను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. బరువు తగ్గే ప్రయత్నం చేసేవారు చక్కెరకు దూరంగా ఉండాలి. టీ, కాఫీల్లో మరీ ఎక్కువ చక్కెర వేసుకోవద్దు. అన్నింట్లోనూ చక్కెర తగ్గించుకోవాలి. స్వీట్లు తినటం మానేయాలి.

సుఖవంతమైన నిద్ర ; బరువు తగ్గాలనుకునే వారు రాత్రి సుఖంగా, హాయిగా నిద్రపోవటం మంచిది. ఎనిమిది గంటల పాటు నిద్రపోవటం వల్ల శరీరం యాక్టివ్ గా మారుతుంది. బరువు తగ్గడంలో సుఖవంతమైన నిద్ర ముఖ్య పాత్ర వహిస్తుంది. హ్యాపీగా నిద్రపోవడం వల్ల ఆకలి కలిగించే హార్మోన్లు కూడా తగ్గుతాయి. కాబట్టి ఆకలి తగ్గి, బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిద్రించే ప్రదేశం చీకటిగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. తద్వారా బరువు త్వరగా తగ్గేందుకు వీలవుతుంది.

స్పైసీ ఫుడ్స్ ; కారం ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల మన మెటబాలిజం సాధారణ స్థాయి కంటే ఎక్కువ వేగంగా ఉంటుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వును తగ్గించటంలో దోహదపడుతుంది. కారపు పదార్ధాలు తినేవాళ్లు ఆహారం కూడా తక్కువగా తింటారు. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

ట్రెండింగ్ వార్తలు