Aamir Khan : సల్మాన్ ఖాన్ కోసం ఫొటోగ్రాఫర్‌గా మారిన అమీర్ ఖాన్..

తాజాగా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లి అమీర్ ఖాన్ తల్లి, సోదరి, వాళ్ళ కుటుంబ సభ్యులతో సమయం గడిపాడు. అమీర్ కుటుంబ సభ్యులతో సల్మాన్ ఖాన్ దిగిన ఫోటోని అమీర్ ఖాన్ సోదరి నిఖత్ హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో..............

Aamir Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల చాలా గ్యాప్ తీసుకొని లాల్ సింగ్ చద్దా సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా పరాజయం పొందింది. దీంతో కొన్ని రోజులు సినిమాలకి గ్యాప్ ఇస్తున్నాను అంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అమీర్. ఇటీవల కొన్ని నెలల క్రితం తన కూతురి నిశ్చితార్థంలో కనపడ్డ అమీర్ మళ్ళీ కనపడలేదు.

ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం వరుస సినిమాలతో హడావిడి చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్, షారుఖ్, అమీర్ ల మధ్య సినిమాలతో పోటీ ఉన్నా బయట మాత్రం వీరు మంచి స్నేహితులు. ఈ విషయాన్ని వాళ్ళే అనేక సార్లు మీడియా ముందు చెప్పారు. ఒకరితో ఒకరు క్లోజ్ గా ఉంటూ వారి బంధాన్ని చూపించారు.

Ala Vaikuntapuramlo : షెహజాదాకి షాక్ ఇచ్చిన అలవైకుంఠపురంలో.. వాళ్ళ సినిమాతో వాళ్ళకే ఎఫెక్ట్..

తాజాగా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లి అమీర్ ఖాన్ తల్లి, సోదరి, వాళ్ళ కుటుంబ సభ్యులతో సమయం గడిపాడు. అమీర్ కుటుంబ సభ్యులతో సల్మాన్ ఖాన్ దిగిన ఫోటోని అమీర్ ఖాన్ సోదరి నిఖత్ హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. సల్మాన్ అమీర్ ఇంట్లో ఏం చేస్తున్నాడు, అమీర్ ఖాన్ ఎక్కడ అని నెటిజన్లు కామెంట్ పెట్టడంతో మరో ఫోటోని పోస్ట్ చేసింది నిఖత్. ఈ ఫొటోలో అమీర్ ఖాన్ సల్మాన్ తో ఉన్న కుటుంబ సభ్యులని ఫొటో తీస్తున్నాడు. సల్మాన్ ని అమీర్ ఫొటో తీయడంతో ఈ ఫొటో మరింత వైరల్ గా మారింది. వీరిద్దరి స్నేహం గురించి మరోసారి అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటూ సల్మాన్ ఖాన్ కోసం అమీర్ ఖాన్ ఫోటోగ్రాఫర్ గా మారాడని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు