Nayanthara : షారుక్ ఖాన్ కోసం మ‌న‌సు మార్చుకున్న న‌య‌న్‌..? ఏ విష‌యంలోనంటే..?

ఏదైన సినిమా విడుద‌ల అవుతుందంటే ఆ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు టీవీ షోలకు వెళ్లడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా త‌మ సినిమాను ప్ర‌మోట్ చేసుకోవడాన్ని సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం.

Nayanthara-Shah Rukh Khan

Nayanthara-Shah Rukh Khan : ఏదైన సినిమా విడుద‌ల అవుతుందంటే ఆ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు టీవీ షోలకు వెళ్లడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా త‌మ సినిమాను ప్ర‌మోట్ చేసుకోవడాన్ని సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం. మామూలు హీరోల నుంచి సూప‌ర్ స్టార్ ల వ‌ర‌కు దాదాపుగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే.. ద‌క్షిణాది లేడి సూప‌ర్ స్టార్ గా పేరు గాంచిన న‌య‌న‌తార(Nayanthara) మాత్రం ఇందుకు మిన‌హాయింపు. తాను న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఆమె ఎప్పుడూ పాల్గొన‌దు. గ‌త కొన్నేళ్లుగా ఆమె ఈ ఖండిష‌న్‌తోనే సినిమాకు సైన్ చేస్తోంది. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మాత్ర‌మే ఆమె న‌టించిన సినిమాలు ప్ర‌మోట్ చేయ‌టాన్ని చూశాం.

Tiger Nageswara Rao : పాన్ ఇండియా మార్కెట్‌లోకి గజదొంగ ఎంట్రీ.. టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్!

తాజాగా న‌య‌న్.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సర‌స‌న జ‌వాన్ (Jawan) సినిమాలో న‌టించింది. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం జ‌వాన్ సినిమా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో న‌య‌న‌తార భాగం కానుంద‌ని అంటున్నారు.

Gandeevadhari Arjuna Censored : వ‌రుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సెన్సార్ పూర్తి.. ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారంటే..?

షారుఖ్ ఖాన్‌తో క‌లిసి కొన్ని ఈవెంట్స్ చేయ‌నుంద‌ని ఆ వార్తల సారాంశం. ఇదే నిజం అయితే ఇన్నేళ్లుగా పాటిస్తున్న రూల్‌ను న‌య‌న్ బ్రేక్ చేసిన‌ట్లే. ఈ విష‌యం తెలిసిన అభిమానులు ఖుషి అవుతున్నారు. మ‌రీ నిజంగా త‌ను పెట్టుకున్న రూల్ బ్రేక్ జ‌వాన్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో న‌య‌న‌తార పాల్గొంటుందో లేదో మ‌రి కొద్ది రోజుల్లో తెలిసిపోనుంది.

కాగా..జ‌వాన్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్‌లో అరంగ్రేటం చేస్తోంది. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుండగా, ప్రియమణి, అమృత అయ్యర్, సన్యా మల్హోత్రా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌గా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

ట్రెండింగ్ వార్తలు