Pushpa 2 : పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 1000 కోట్లు ఆఫర్ చేశారా..?

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 1000 కోట్లు ఆఫర్ చేశారా..? ఫిలిం వర్గాల్లో ఈ వార్త..

Allu Arjun Pushpa 2 pre release business is goes upto 1000 crores

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ‘పుష్ప-1’ ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కేవలం ఇండియాన్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఈ మూవీకి ఆదరణ కలిగింది. దీంతో ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా హక్కులు పై ఓ రేంజ్ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా రావడంతో మూవీ పై మరింత హైప్ పెరిగింది.

Rana Daggubati : నేష‌న‌ల్‌ అవార్డ్స్‌ కాంట్రవర్సీపై స్పందించిన రానా

దీంతో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రేట్లు కూడా పెరిగినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలుపుకొని మూవీ టీంకి దాదాపు 1000 కోట్ల వరకు ఆఫర్ చేశారట. ప్రస్తుతం ఈ విషయం ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో నిజమెంత ఉందనేది మాత్రం తెలియదు. కానీ ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుందనే వార్త మాత్రం నార్త్ టు సౌత్ హాట్ టాపిక్ అయ్యిపోయింది. మరి రానున్న రోజుల్లో పుష్ప రాజ్ తన రేంజ్ ని ఇంకెంత పెంచుకుంటూ వేళ్తాడో చూడాలి.

Bigg Boss 7 : బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్స్‌కి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు..?

కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించనుండగా సునీల్, అనసూయ, ధనంజయ్, జగదీష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ట్యూన్స్ కి నేషనల్ అవార్డు వరించడంతో పార్ట్ 2 సంగీతం పై మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. దేవిశ్రీ కూడా వాటికీ తగ్గట్టే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు