Balakrishna : అన్‌స్టాపబుల్‌లో ఇండైరెక్ట్‌గా బాబు గురించి బాలయ్య.. చంద్రుడు ఉదయిస్తాడు.. తప్పు చేయలేదని మీకు తెలుసు..

తాజాగా వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో కూడా చంద్రబాబు గురించి ఇండైరెక్ట్ గా చెప్పారని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Balakrishna :  ఆహా(Aha)ఓటీటీలో బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 3 కూడా మొదలైంది. ఆహా ఓటీటీ బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ నిన్న 17వ తేదీ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

అయితే ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య కూడా రంగంలోకి దిగి రాజకీయాల్లో బిజీ అయ్యారు. అనేక ప్రెస్ మీట్స్, మీడియా ముందు చంద్రబాబు అంశంపై మాట్లాడారు. అయితే సినిమా ఈవెంట్స్ లో కూడా ఎక్కడో ఒకచోట ఇండైరెక్ట్ గా బాబు గురించి మాట్లాడుతున్నారు బాలయ్య. తాజాగా వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో కూడా చంద్రబాబు గురించి ఇండైరెక్ట్ గా చెప్పారని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అన్‌స్టాపబుల్ షో ఆరంభంలోనే ఇచ్చిన ఇంట్రోలో బాలయ్య నిల్చొని ఒక పెద్ద డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ లో.. మా మాట మీకు సుపరిచితం. మా బాట మీకు సుపరిచితం. మేమేంటో, మా వాళ్లేంటో మా వెంట ఉండే మీకు సదా నమ్మకం. రోజులు మారినా, రుతులు రంగులు మార్చినా, ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా మళ్ళీ చంద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు. గడ్డుకాలంలో కరుడు గట్టిన గుండెధైర్యం, చెడ్డపని చేయలేదు అనే మానసిక స్థైర్యం మన జీవితంలో అలుపులేని పోరాటానికి ఊతమిస్తుంది. మరుపురాని గెలుపు తీరాలకు చేర్చుతుంది. ఎందుకంటే మేము తప్పుచేయలేదని మీకు తెలుసు. మేము తల వంచమని మీకు తెలుసు. మనల్ని ఆపడానికి ఎవరూ రాలేదని మీకు తెలుసు. మేము మీకు తెలుసు, మా స్థానం మీ మనసు. గుండె బరువెక్కినా, కన్ను చినుకుపట్టినా, చెదరని చిరునవ్వుని పెదవికి పూయించే బాలయ్య మీ సొంతం. అందుకే అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం. ఎవడాపుతాడో చూద్దాం అని బాలయ్య చెప్పారు.

Also Read : Sreeleela : భగవంత్ కేసరి సినిమా చేయొద్దని చాలా మంది చెప్పారు.. అన్‌స్టాపబుల్ లో శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..

అయితే ఇదంతా విన్నాక కచ్చితంగా ఇది చంద్రబాబుకి సపోర్ట్ గానే చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే ఎపిసోడ్ లో మరో రెండు మూడు సార్లు చంద్రబాబు అంశంపై ఇండైరెక్ట్ గా మాట్లాడారు. షోలోకి భగవంత్ కేసరి విలన్ ఎంట్రీ ఇచ్చేముందు.. సినిమా అయినా, లైఫ్ అయినా అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేయడానికి బయలుదేరుతాడు. అది సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటకు రావాలి అని ఇండైరెక్ట్ గా మళ్ళీ బాబు జైలు నుంచి బయటకి రావాలి అని చెప్పడం గమనార్హం. మొత్తానికి బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఇండైరెక్ట్ గా చంద్రబాబు గురించి కూడా ప్రస్తావించారు. దీంతో ఈ వ్యాఖ్యలను టీడీపీ అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు