Anushka Done More Number of Movies with Nagarjuna rather than Prabhas
Nagarjuna – Anushka : అనుష్క ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది కానీ కొన్నేళ్ల ముందు వరకు కూడా స్టార్ హీరోయిన్ గా, స్పెషల్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి టాలీవుడ్ ని రూల్ చేసింది. కమర్షియల్, ప్రయోగాత్మక, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు చాలా సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. అనుష్క ఎక్కువ సినిమాలు ఎవరితో చేసింది అంటే ప్రభాస్ – అనుష్క పెయిర్ బాగా హిట్ అవ్వడంతో ప్రభాస్ పేరే చెప్తారు. ప్రభాస్ తో అనుష్క నాలుగు సినిమాలు చేస్తే నాలుగు హిట్ అయ్యాయి.
కానీ అనుష్క ప్రభాస్ తో కంటే ఎక్కువగా నాగార్జునతో సినిమాలు చేసింది. నాగార్జునతో ఏకంగా అనుష్క 10 సినిమాలు చేసింది. అసలు అనుష్కని నాగార్జుననే సినీ పరిశ్రమకు పరిచయం చేసాడు. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన సూపర్ సినిమాతో అనుష్క సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత అనుష్క.. డాన్, కింగ్, కేడి, రగడ, డమరుకం, సైజ్ జీరో, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి, ఓం నమో వెంకటేశాయ.. సినిమాలలో నాగార్జునతో కలిసి నటించింది.
Also Read : SJ Suryah – Pawan Kalyan : నా ఫ్రెండ్ డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్.. సీఎంగా మీరే చేయాలి..
అయితే ఇందులో సూపర్, డాన్, రగడ, డమరుకం, ఓం నమో వెంకటేశాయ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కింగ్, కేడి, సోగ్గాడే చిన్ని నాయన సినిమాల్లో అనుష్క పాటల్లో కనిపించి అలరించింది. ఊపిరి సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. అనుష్క సైజ్ జీరో సినిమాలో నాగార్జున గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇలా అనుష్క మొత్తం నాగార్జునతో పది సినిమాల్లో నటించింది. ఒకప్పుడు హీరో – హీరోయిన్స్ కాంబోలు చాలా సినిమాల్లో రిపీట్ అయ్యేవి. కానీ ఈ జనరేషన్ లో ఒక హీరోయిన్ తో హీరో ఒక సినిమా చేస్తే గ్రేట్. అలాంటిది నాగార్జున – అనుష్క పదిసార్లు కలిసి నటించడం విశేషమే.
ఇక అనుష్క ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. మళ్ళీ తన సినిమాలతో ఎప్పుడు పలకరిస్తుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.