Bigg Boss 7 Day 27 : సందీప్, శివాజీలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ మొత్తం శివాజీ పైనే..

శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు

Bigg Boss 7 Day 27 Highlights Nagarjuna Fires on Sivaji and Sandeep

Bigg Boss 7 Day 27 :  వీకెండ్ ఎపిసోడ్ రాగానే బిగ్‌బాస్ లో శనివారం నాడు కంటెస్టెంట్స్ చేసిన తప్పులని గుర్తుచేస్తూ నాగార్జున(Nagarjuna) ఫైర్ అవుతాడు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఇదే జరిగింది. అయితే శనివారం ఎపిసోడ్ లో పూర్తిగా శివాజీని టార్గెట్ చేశారు. గత వారం టాస్కుల్లో సంచలక్ గా పవరాస్త్ర గెలుచుకున్న శివాజీ, సందీప్ లు ఉన్నారు. మొదట సందీప్ తో.. నువ్వేమన్నా గుడ్డోడివా? కంటెస్టెంట్స్ చేసేవి కనపడట్లేదా అని ఫైర్ అయ్యాడు. సందీప్ వివరణ ఇద్దామనుకున్నా నాగ్ వినలేదు. సందీప్ ని సంచలక్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యావు అని ఫైర్ అయ్యాడు.

అనంతరం మరో సంచాలక్ గా చేసిన శివాజీపై ఫైర్ అయ్యారు నాగార్జున. ఒకరి వైపే ఆడుతున్నావంటూ, నువ్వు మంచిగా ఆడతావు, వీక్ కంటెస్టెంట్స్ కి న్యాయం చేస్తావు అనుకున్నాను కానీ నువ్వు చేసిన పనుల్లో నాకు న్యాయం కనిపించలేదు అని శివాజీపై ఫైర్ అయ్యాడు నాగ్. టాస్కులో భాగంగా తేజ గౌతమ్ మెడపై తాడు వేసి లాగగా అది హౌస్ లో పెద్ద గొడవకు దారి తీసింది. నాగ్ దాన్ని గుర్తుచేసి అది తప్పు అని తేజకి క్లాస్ పీకాడు.శివాజీ కూడా తప్పని చెప్పకపోవడంతో శివాజీకి కూడా క్లాస్ పీకాడు. ఈ తప్పు చేసినందుకు పనిషమెంట్ గా తేజని జైలులో పెట్టడంతో పాటు వచ్చేవారం డైరెక్ట్ గా నామినేట్ చేసి షాక్ ఇచ్చాడు నాగార్జున.

శివాజీ, సందీప్ లు సంచాలక్ గా ఫెయిల్ అవ్వడంతో వారు గెలుచుకున్న వారిలో ఎవరో ఒకరి దగ్గర్నుంచి పవరాస్త్రని తీసేసుకుంటానని నాగార్జున చెప్పాడు. అయితే కంటెస్టెంట్స్ లో ఎక్కువమంది ఎవరు పవరాస్త్రకు అనర్హులో చెప్తే వాళ్ళ పవరాస్త్ర తీసుకుంటానని నాగ్ చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ ని మొదట కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అడిగాడు. ఆ తర్వాత అందరి ముందు అడిగాడు. సందీప్ ని ముగ్గురు నామినేట్ చేయగా, శివాజీని ఆరుగురు నామినేట్ చేశారు. దీంతో నాగార్జున శివాజీకి ఇచ్చిన పవరాస్త్రని తీసేసుకున్నాడు. ఇన్నాళ్లు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న శివాజీ వచ్చే వారం నుండి నామినేషన్స్ లో ఉండొచ్చు.

Also Read : Bigg Boss 7 : త‌ప్పుచేసిన టేస్టీ తేజ‌.. వీడియో చూపించి మ‌రీ.. మండిప‌డ్డ నాగార్జున‌

ఇక ఈ వారం నామినేషన్స్ లో ప్రియాంక, రతిక, ప్రిన్స్, శుభశ్రీ, గౌతమ్, తేజలు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో నేటి ఎపిసోడ్ లో చూడాలి. ఇప్పటికే వచ్చిన టాక్ ప్రకారం రతిక ఎలిమినేట్ అవుతుందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు