BiggBoss 6 Day 35 : దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ.. బిగ్‌‌బాస్‌ నుంచి చలాకి చంటి అవుట్..

బిగ్‌‌బాస్‌ హౌజ్ లో ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ సరదాగా, ఎలిమినేషన్ ఉత్కంఠతో సాగిపోయింది. వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల దేవిశ్రీ ఓ ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేయగా...............

BiggBoss 6 Day 35 :  బిగ్‌‌బాస్‌ హౌజ్ లో ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ సరదాగా, ఎలిమినేషన్ ఉత్కంఠతో సాగిపోయింది. వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల దేవిశ్రీ ఓ ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేయగా దాన్ని షోలో ప్లే చేశారు. కాసేపు దేవి బిగ్‌‌బాస్‌ హౌజ్ లో సందడి చేశాడు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి కొన్ని గేమ్స్ పెట్టాడు నాగార్జున. కొన్ని చిట్టీలు ఇచ్చి అందులో ఒక పాట పేరు ఉంటుంది, దానిని బొమ్మలాగా గీసి ఆ పాట ఏంటో కనుక్కోవాలి అని చెప్పారు. ఇందుకు కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఈ గేమ్ ఫుల్ ఎంటర్టైన్ గా సాగింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ని సామెతలు చెప్పమన్నాడు. ఇది కూడా సరదాగా సాగింది. ఈ రెండు గేమ్స్ అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు.

ఇప్పటికే హౌజ్ నుంచి షాని, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి ఎలిమినేటి అవ్వగా ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళని శనివారం ఎపిసోడ్ లోనే కొంతమందిని సేవ్ చేశారు. దీంతో చివరగా ఇనయా, చంటిలు మిగిలారు. చివరగా చంటికి తక్కువ ఓట్లు వచ్చాయంటూ చంటిని ఎలిమినేటి చేశారు. దీంతో ఇంటి సభ్యులంతా చంటిని దగ్గరుండి పంపించారు. ఆ తర్వాత చంటి బిగ్‌‌బాస్‌ స్టేజి మీదకి వచ్చాడు. వెళ్లేముందు ఇంటి సభ్యుల గురించి నాగార్జున మాట్లాడమన్నారు. అలాగే వాళ్ళకి పాస్, ఫెయిల్ మార్కులు కూడా నాగార్జున ఇమ్మనగా అర్జున్‌, సుదీప, రోహిత్, రాజ్‌, కీర్తిలకు 34 అండ్ హాఫ్ మార్కులు ఇచ్చి ఫెయిల్‌ అని, మిగిలినవారందర్నీ పాస్ చేశాడు.

Nayanthara Vignesh Shivan : కవలలకు తల్లి అయిన నయనతార.. ముందే చెప్పిన ఎన్టీఆర్..! మ్యాటర్ ఏంటంటే..

చంటి వెళ్తూ ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడాడాడు. అర్జున్‌ తప్పులను చెప్పి గేమ్ మీద ఫోకస్ పెట్టాలన్నాడు. సుదీపకి కిచెన్‌లోనే టైమ్‌ సరిపోతుందని, దాంతో గేమ్స్ సరిగ్గా ఆడట్లేదని కిచెన్ నుంచి బయటకి వచ్చి గేమ్స్ ఆడాలని సూచించాడు. రోహిత్ తనలాగే ఉంటాడని, తను చేసిన తప్పు మాత్రం చేయొద్దని చెప్పాడు. రాజ్ అందర్నీ నమ్ముతాడు, తాను ఆడాలనుకున్న ఆట ఆడలేకపోతాడు అని చెప్పాడు. కీర్తి మాటిమాటికి తన గతాన్ని గుర్తుచేసుకొని బాధపడుతుంది, ఆ గతాన్ని పక్కన పెట్టి గేమ్ ఆడాలని చెప్పాడు. సూర్య అందర్నీ ప్రేమిస్తాడు అది మానేసి ఆట ఆడితే మంచిది. శ్రీహాన్ కి చాలా మంచి క్లారిటీ ఉంది. ఫైమా అందర్నీ నవ్విస్తుంది. ఇక మరీనా మదర్ ఇండియా అని, రోహిత్ ఆమెకు ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఇనయాకి 100 మార్కులివ్వడం గమనార్హం. ఆదిరెడ్డి, గీతూలకి కొన్ని సలహాలిచ్చాడు. బాలాదిత్య మంచితనం అనే మేకప్ వేసుకున్నాడు అని వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి బిగ్‌‌బాస్‌ ఐదోవారంలో చలాకి చంటి ఎలిమినేటి అయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు