Honeymoon Express : ఇలాంటి టైంలో స్క్రీన్స్ పెంచి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’

చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమా నిన్న జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది.

Honeymoon Express : గత కొన్ని రోజులుగా థియేటర్స్ లో సినిమాలు ఎక్కువ రోజులు నిలబడటం లేదు. రిలీజయిన సినిమాలు వారం రోజులకే థియేటర్స్ నుంచి బయటకు వస్తున్నాయి. ఇక చిన్న సినిమాలు అయితే చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ చేసిన థియేటర్స్ కూడా నిండని సమయంలో హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాకు మొదటి రోజు కంటే రెండో రోజు స్క్రీన్స్ పెంచడం గమనార్హం.

చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సినిమా నిన్న జూన్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది. తనికెళ్ల భరణి, సుహాసిని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అయితే మొదటిరోజు కేవలం 50 స్క్రీన్ తో రిలీజైన హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఇప్పుడు 70 స్క్రీన్స్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారు. బీ, సీ సెంటర్స్ లో కొత్త థియేటర్స్ జత అవుతున్నాయి.

Also Read : Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్..

పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలను ఎలా తొలగించాలి అని రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో చూపించారు దర్శకుడు బాల రాజశేఖరుని. ఈ సినిమాలో కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించిన పాటలు మాత్రం బాగున్నాయి. ఇక హెబ్బా పటేల్ కూడా అందాల ఆరబోత బాగానే చేసింది. ఈ సినిమాకు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్.. ఇలా చాలా మంది సపోర్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేసారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు