Kalki 2898AD : తెలంగాణలో భారీగా కల్కి టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే.. బెనిఫిట్ షోలు కూడా..

తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ, బెనిఫిట్ షోలకు కూడా అనుమతులిస్తూ పర్మిషన్ ఇచ్చింది.

Kalki 2898AD : ప్రభాస్(Prabhas) కల్కి సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కి నుంచి రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ తో, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి. సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. భారీ బడ్జెట్ తో స్టార్ నటీనటులతో తెరకెక్కించిన కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది.

ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు సినిమా టికెట్ ధరలు పెరుగుతాయి. మూవీ యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇప్పటికే కల్కి టికెట్ రేట్ల పెంపు కోసం ప్రతిపాదనలు పంపగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతులిస్తూ పర్మిషన్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read : Tollywood Pan India Movies : టాలీవుడ్‌ పాన్ ఇండియా మూవీస్‌.. నార్త్ లో తెలుగు సినిమాలకు క్రేజ్ మాములుగా లేదుగా..

తెలంగాణలో రిలీజ్ రోజు బెనిఫిట్ షో ఉదయం 5.30 గంటల ఆటకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. బెనిఫిట్ షోకు 200 రూపాయలు పెంచింది. అలాగే 8 రోజుల వరకు టికెట్ ధరలు పెంచి, అయిదు ఆటలకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ కు 70 రూపాయలు, మల్టిప్లెక్స్ లో 100 రూపాయలు పెంచారు. పెరిగిన రేట్ల ప్రకారం కల్కి సినిమా టికెట్ ధర సింగిల్ స్క్రీన్స్ లో 265 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 413 రూపాయలు ఉండనుంది. బెనిఫిట్ షోకి మాత్రం సింగిల్ స్క్రీన్స్ 377 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 495 రూపాయలు ఉండనుంది టికెట్ రేట్లు. ఈ రేంజ్ లో టికెట్ రేట్లు పెంచడంతో సినిమా లవర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు