Tollywood Pan India Movies : టాలీవుడ్‌ పాన్ ఇండియా మూవీస్‌.. నార్త్ లో తెలుగు సినిమాలకు క్రేజ్ మాములుగా లేదుగా..

మనోళ్లు కూడా వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. లెక్కలేని బడ్జెట్‌, అంతులేని ప్రమోషన్స్‌తో మనోళ్లు బాలీవుడ్‌ను మించి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.

Tollywood Pan India Movies : టాలీవుడ్‌ పాన్ ఇండియా మూవీస్‌.. నార్త్ లో తెలుగు సినిమాలకు క్రేజ్ మాములుగా లేదుగా..

North India having full Hopes on Tollywood Pan India Movies

Tollywood Pan India Movies : తెలుగు సినిమా. ఒకప్పుడు గల్లీ పిక్చర్‌గానే ఉండిపోయేది. తెలుగు ప్రజలు మాత్రం మన మూవీస్‌ను చూసి ఫిదా అయ్యేవారు. రోజులు మారాయి. ఇప్పుడు అందరికీ అన్ని సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు దేశంలో ఏ లాంగ్వేజ్ మాట్లాడే జనం అయినా తెలుగు ఫిల్మ్స్‌ అంటే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు డైరెక్టర్స్ తీసే విజువలైజేషన్, ఇట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్‌.. బాలీవుడ్‌ను దాటి ఇంటర్నేషనల్‌ రేంజ్‌కు చేరుకున్నాయి. అందుకే తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీగా మారుతోంది. సినిమాలోని మాటలు, డైలాగ్స్ అన్నిభాషల్లో డబ్‌ అవుతుండటంతో ప్రాంతీయ భాషల్లో మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. తెలుగు సినిమాలకు క్రేజ్‌ మామూలుగా లేదు.

ఎవరు అవునన్నా కాదన్నా బాహుబలి మూవీ నుంచి తెలుగు సినిమా రేంజ్‌ పీక్‌కు వెళ్లింది. మూవీస్‌ పరంగా తెలుగోడి వ్యాల్యూ కూడా పెరిగిపోయింది. బాలీవుడ్‌ డైరెక్టర్లు, స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే రేంజ్‌లో మనోళ్లు మూవీస్‌ తీస్తున్నారు. బాహుబలి-2 తర్వాత మన డైరెక్టర్లు చాలామంది పాన్ ఇండియా మూవీస్‌ తెరకెక్కిస్తున్నారు. పుష్ప, RRR.. తర్వాత తెలుగు సినిమా రేంజ్‌ అంతకంతకు పెరిగిపోతుంది.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే అమ్మో అనేవాళ్లు. ఇప్పుడు సినిమాకు 10 కోట్ల బడ్జెట్ అంటే చాలా కామన్ అయిపోయింది. మనోళ్లు కూడా వందల కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. లెక్కలేని బడ్జెట్‌, అంతులేని ప్రమోషన్స్‌తో మనోళ్లు బాలీవుడ్‌ను మించి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. కొన్నాళ్లుగా బాలీవుడ్‌ ఫ్లాప్‌లకు కేరాఫ్‌ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్‌కు అడ్డాగా మారుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఎక్కువ సంఖ్యలో సినిమాలు తీసిన అనుభవం కూడా లేని తెలుగు డైరెక్టర్లు పాన్ ఇండియా మూవీస్‌ తీస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Also Read : Sandeham : ‘సందేహం’ మూవీ రివ్యూ.. భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథతో..

పాన్ ఇండియా మూవీస్‌తో నార్త్‌, సౌత్ అన్న ముచ్చటే లేకుండా పోయింది. టాలీవుడ్, బాలీవుడ్‌ అన్న లెక్కలే లేవు. ప్రాంతీయ భాషల్లో ఆకట్టుకున్న మూవీస్‌ కూడా పాన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి. చిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కి కూడా సక్సెస్‌ అయితే పాన్ ఇండియా మూవీస్‌గా మారిపోతున్నాయి. కాన్సెప్ట్ బాగుంది, ఫ్యాన్స్ ఆదరిస్తారన్న నమ్మకం ఉంటే చాలు మిగతా భాషల్లోకి డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే చిన్నపాటి సినిమాలు కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీనికి ఈ మధ్య వచ్చిన కాంతారా, మంజుమ్మల్ బాయ్స్‌, ప్రేమలు.. లాంటి సినిమాలే ఎగ్జాంపుల్‌.

అయితే పాన్ ఇండియా మూవీస్‌లో అన్ని భాషల నటుల్ని కలుపుతూ ఇదివరకు చూడని కాంబినేషన్‌తో మంచి సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు డైరెక్టర్లు. దీంతో అప్పటివరకు పరిచయం లేని ఆర్టిస్టులు కూడా ఫ్యాన్స్‌ను తమ నటనతో ఆకట్టుకునే అవకాశం దొరుకుతుంది. సౌత్ హీరోయిన్స్‌ బాలీవుడ్ సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా ఉన్న భామలు మాత్రం ఇదివరకు ప్రాంతీయ సినిమాలపై అంతగా ఆసక్తి చూపేవారుకాదు. పాన్‌ ఇండియా ట్రెండ్‌ అలాంటి సిచ్యువేషన్స్‌ను మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌ టాప్ హీరోయిన్లు కూడా తెలుగు, తమిళ్‌ మూవీస్‌లో నటిస్తున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి తెరకెక్కుతున్న సినిమాల్లో బాలీవుడ్‌తో పాటు వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులకు అవకాశాలు దక్కుతున్నాయి. హీరో, హీరోయిన్లే కాదు చిన్నచిన్న ఆర్టిస్టులకు కూడా సినిమాల్లో మంచి రోల్స్‌ దక్కుతున్నాయి. కొంతమంది అయితే బాలీవుడ్‌లో కంటే సౌత్ మూవీస్‌లో ఎక్కువగా రాణిస్తున్నారు. వరుసగా మూవీస్‌లో అవకాశాలు రావడంతో ఇక్కడే బిజీ అయిపోతున్నారు.

Also Read : Adivi Sesh : సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు.. అడివి శేష్ కార్ నంబర్‌కు సంబంధం.. కావాలని ఆ నంబర్..

ఇప్పుడు వస్తున్న పుష్ప-2, కల్కి, దేవర, గేమ్ ఛేంజర్‌, హరిహర వీరమల్లు.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కతున్నాయి. టాలీవుడ్‌ డైరెక్టర్లు తీస్తున్న సినిమాల్లోనూ బాలీవుడ్‌తో పాటు తమిళ, మళయాళీ, కన్నడ నటులను తీసుకుంటున్నారు. అప్ కమింగ్‌ డేస్‌లో పాన్‌ ఇండియా మూవీ గురించి మాట్లాడుకునే సందర్భం వస్తే టాలీవుడ్‌ ప్రస్తావన లేకుండా ఉండదన్నంతగా తెలుగు సినిమా ఎదుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోయే కొన్ని సినిమాల కోసం దేశమంతా ఎదురుచూస్తుంది.

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి మూవీ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. రెండు ట్రైలర్లలో విజువలైజేషన్, ఎఫెక్స్ట్, గ్రాఫిక్స్ వేరే రేంజ్‌లో ఉన్నాయి. దాదాపు 500 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీలో 250 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అనే చెప్తున్నారు. మిగతా 200 కోట్లు హీరో, హీరోయిన్లు మిగతా స్టార్ల రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. కల్కి మూవీకి ప్రభాస్‌ ఒక్కడే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. థియేట్రిక‌ల్ బిజినెస్ 400 కోట్లు, డిజిటల్ బిజినెస్ 300 కోట్లతో ఓవరాల్‌గా కల్కి సినిమాకు 700 కోట్ల వరకు బిజినెస్ అవుతుందని, 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని అంచనాలు ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు పుష్ప-2పై అయితే ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఆర్టిస్టులకు కూడా రెమ్యునరేషన్ గట్టిగానే ఇస్తున్నారు. ఈ సినిమా కూడా వెయ్యికోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని డిసెంబర్ లో రాబోతుంది.

Also Read : Allu Arjun – Adivi Sesh : రోడ్డు మీద షూటింగ్ చేసుకుంటుంటే అల్లు అర్జున్ వచ్చి.. అడివి శేష్ తో..

ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీ 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇందులో ప్రొడ‌క్షన్ కాస్ట్ 100 కోట్లు, ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. దేవర మూవీ తెలుగు బిజినెసే వంద కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కూడా ఫ్యాన్స్ అంచనాలను పెంచేస్తోంది. 250 కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చాలా లేట్ అవుతున్నా అంచనాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందులోను డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో భారీగానే అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ పాన్ ఇండియా సినిమాలకు నార్త్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. నార్త్ ఇండియాలో ఈ సినిమాల థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ పెరిగిపోయింది. పుష్ప 2, కల్కి సినిమాలకు దాదాపు 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ నార్త్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం కూడా నార్త్ లో పోటీ పడుతున్నారు. RRR తర్వాత చరణ్ కి నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో గేమ్ ఛేంజర్ కు దాదాపు 50 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ వచ్చేలా ఉందని సమాచారం.