Sandeham : ‘సందేహం’ మూవీ రివ్యూ.. భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథతో..

'సందేహం' సినిమా భార్యాభర్తల మధ్యలోకి కరోనా సమయంలో భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఏం జరిగింది అని సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

Sandeham : ‘సందేహం’ మూవీ రివ్యూ.. భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథతో..

Suman Tej Hebah Patel Sandeham Movie Review and Rating

Sandeham Movie Review : సుమన్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సందేహం’. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమన్ తేజ్ డ్యూయల్ రోల్ చేయగా బిగ్ బాస్ శ్వేతా వర్మ, రాశిక శెట్టి, బిగ్ బాస్ శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే.. ఇది కరోనా సమయంలో జరిగిన కథ. హర్ష(సుమన్ తేజ్) ప్రేమించిన అమ్మయి శృతి(హెబ్బా పటేల్)ని ప్లాన్ చేసి అరేంజ్డ్ మ్యారేజిలా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు, ఆ తర్వాత కూడా శ్రుతి కొంచెం టైం కావాలంటుంది. అదే సమయంలో హర్ష లాగే ఉండే ఆర్య(సుమన్ తేజ్) వీళ్ళ జీవితంలోకి శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వస్తాడు. హర్ష, శృతి ఉండే అపార్ట్మెంట్ లోనే ఆర్య ఇల్లు తీసుకొని అప్పుడప్పుడు వీళ్ళింటికి వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇదంతా హర్ష తట్టుకోలేకపోతాడు. వీళ్ళేం చేస్తారో చూద్దాం అని ఒక రోజు బెంగుళూరు వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు. తిరిగి వచ్చాక హర్షకు కరోనా వస్తుంది.

కరోనా లక్షణాలు ఎక్కువవడంతో హాస్పిటల్ లో జాయిన్ అవుతాడు. కరోనాతోనే హర్ష చనిపోయాడు అని ఫ్యామిలీ డాక్టర్ శ్రుతికి చెప్తాడు. హర్ష చనిపోయాడని వాళ్ళ ఫ్యామిలీ అంతా బాధలో ఉంటుంది. కానీ ఒక రోజు హర్ష ఫోన్ నుంచి హర్ష చెల్లికి(రాశిక శెట్టి) మిస్డ్ కాల్ వస్తుంది. దీంతో హర్ష చెల్లికి డౌట్ వచ్చి అసలు తన అన్నయ్య చనిపోయాడా బతికే ఉన్నాడా అని ఆలోచించడం మొదలుపెడుతుంది. మరి హర్ష చనిపోయాడా? బతికే ఉన్నాడా? హర్ష చెల్లికి కాల్ ఎవరు చేశారు? పోలీసులు హెబ్బా పటేల్ ని ఎందుకు అదుపులోకి తీసుకుంటారు? ఆర్య ఏమయ్యాడు? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Adivi Sesh : సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు.. అడివి శేష్ కార్ నంబర్‌కు సంబంధం.. కావాలని ఆ నంబర్..

సినిమా విశ్లేషణ.. భార్యాభర్తల మధ్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఏంటి అని గతంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో ఆ పాయింట్ తీసుకున్నా కరోనాతో పాటు ఓ కొత్త పాయింట్ ని తీసుకున్నాడు దర్శకుడు. మొదటి హాఫ్ అంతా హర్ష – శృతి మధ్యలో ఆర్య రావడం, కరోనా, హర్షకు కరోనా వచ్చి చనిపోవడంతో ఇంటర్వెల్ కి నెక్స్ట్ ఏంటి అనే ఓ ఆసక్తి కలుగుతుంది.

అయితే ఇంటర్వెల్ సీన్ తో సెకండ్ హాఫ్ అందరూ అనుకున్నట్టు కాకుండా మరో కొత్త కోణంలో చూపిస్తారు. దీంతో కొన్ని ట్విస్ట్ లు బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్ లో ఓ ఎమోషన్ తో పాటు మరో ట్విస్ట్ ఇస్తారు. అయితే సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్ళు ఈ ట్విస్ట్ ఊహించేస్తారు. మళ్ళీ క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ ఇచ్చి అసలు క్లైమాక్స్ ఏంటి అని సందేహంతో సినిమాని ముగిస్తారు. కథ, కథనం కొంచెం కొత్తగా రాసుకున్నా క్లైమాక్స్ సరిగ్గా రాసుకుంటే బాగుండేది. ఇక కొన్ని సీన్స్ కూడా ఓ పక్కన కరోనా అంటూనే మరో పక్క మాములు సీన్స్ లా చిత్రీకరించారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సుమన్ తేజ్ హర్ష, ఆర్య రెండు పాత్రల్లో డ్యూయల్ రోల్ చేసి మెప్పిస్తాడు. హర్ష పాత్రలో నిదానంగా, ఆర్య పాత్రలో ఫుల్ యాక్టివ్ గా నటించాడు. ఇక హెబ్బా పటేల్ తన అందంతో పాటు నటనతో అలరిస్తుంది. ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పిస్తుంది. హీరో చెల్లి పాత్రలో రాశిక శెట్టి కూడా తన అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. బిగ్ బాస్ శ్వేతా వర్మ పోలీసాఫీసర్ గా పర్వాలేదనిపిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తాయి. కథలో కొత్తదనం ఉన్నా కథనం కొంచెం రొటీన్ గా ఉంటుంది. దర్శకుడిగా సతీష్ పరమవేద సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘సందేహం’ సినిమా భార్యాభర్తల మధ్యలోకి కరోనా సమయంలో భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఏం జరిగింది అని సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.