Adivi Sesh : సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు.. అడివి శేష్ కార్ నంబర్‌కు సంబంధం.. కావాలని ఆ నంబర్..

తాజాగా అడివి శేష్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలని తెలిపాడు. ఈ క్రమంలో తన కార్ నంబర్, సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడాడు.

Adivi Sesh : సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు.. అడివి శేష్ కార్ నంబర్‌కు సంబంధం.. కావాలని ఆ నంబర్..

Adivi Sesh says Interesting Things about his Car Number and Super Star Krishna

Adivi Sesh : తక్కువ బడ్జెట్ లో మంచి మంచి సినిమాలు తీసి హిట్స్ కొట్టి స్టార్ అయ్యాడు అడివి శేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా కెరీర్ మొదలుపెట్టి క్షణం సినిమాతో హీరోగా నిలబడ్డాడు. మేజర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు శేష్. ప్రస్తుతం గూఢచారి 2, డెకాయిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు శేష్. తాజాగా అడివి శేష్ ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలని తెలిపాడు. ఈ క్రమంలో తన కార్ నంబర్, సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడాడు.

అడివి శేష్ మాట్లాడుతూ.. నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి గూఢచారి 116 సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాతోనే తెలుగులో స్పై సినిమాలు రావడం మొదలయ్యాయి. నా గూఢచారి సినిమాకు ప్రేరణ ఆ సినిమానే. నాకు కృష్ణ గారి గూఢచారి సినిమాలో 116 నంబర్ ఇష్టం. నా గూఢచారి సినిమాలో కూడా ఆ నంబర్ ఉంటుంది. నా కార్ కి కూడా ఆ నంబర్ కావాలని తీసుకున్నాను అని తెలిపాడు.

Also Read : Allu Arjun – Adivi Sesh : రోడ్డు మీద షూటింగ్ చేసుకుంటుంటే అల్లు అర్జున్ వచ్చి.. అడివి శేష్ తో..

అడివి శేష్ కార్ నంబర్ 0116. అడివి శేష్ స్పై, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో మెప్పిస్తాడని తెలిసిందే. కానీ స్పై సినిమాలు అంటే మరీ ఇంత ఇష్టమా, తన కార్ కి కూడా గూఢచారి నంబర్ తీసుకునేంత అని ఆశ్చర్యపోతున్నారు.

Adivi Sesh says Interesting Things about his Car Number and Super Star Krishna