Allu Arjun – Adivi Sesh : రోడ్డు మీద షూటింగ్ చేసుకుంటుంటే అల్లు అర్జున్ వచ్చి.. అడివి శేష్ తో..
తాజాగా అడివి శేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్షణం సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తో జరిగిన ఓ సంఘటనని పంచుకున్నాడు.

Adivi Sesh Interesting Comments on Allu Arjun he Meet and Surprised while Kshanam Shooting
Allu Arjun – Adivi Sesh : అడివి శేష్ తక్కువ బడ్జెట్ లోనే మంచి మంచి సినిమాలు తీసి హిట్స్ కొడతాడు. అయితే క్షణం సినిమా తర్వాతే అడివి శేష్ స్టార్ అయ్యాడు. దాని కంటే ముందు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా కూడా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అడివి శేష్ పాన్ ఇండియా స్టార్. మేజర్ తో ఇండియా వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గూఢచారి 2, డెకాయిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు శేష్.
Also Read : Pranav Preetham : ఈ కొత్త హీరో.. స్టార్ విలన్ తనయుడు అని తెలుసా? తల్లి కూడా నటి..
అయితే తాజాగా అడివి శేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్షణం సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తో జరిగిన ఓ సంఘటనని పంచుకున్నాడు. అడివిశేష్ మాట్లాడుతూ.. క్షణం సినిమా చాలా చిన్న బడ్జెట్ లో తీసాము. దాంతో చాలా తక్కువ రిసోర్స్ తో పనిచేసాము. మణికొండలో రోడ్ మీద క్షణం సినిమా ఓపెనింగ్ సీన్ షూట్ చేస్తున్నాము. సడెన్ గా మా దగ్గరికి ఒక కార్ వచ్చింది. కార్ విండో గ్లాస్ తీశారు. చూస్తే అల్లు అర్జున్. అల్లు అర్జున్ నన్ను పిలిచి ఏంటి శేష్ ఇక్కడ ఏం చేస్తున్నావ్, రా మా ఇల్లు పక్కనే అని అన్నారు. అప్పుడు నేను సినిమా షూట్ జరుగుతుంది అని చెప్పాను. ఆయన చుట్టూ చూసి షూటింగా, యూనిట్ ఎక్కడ, జనాలు ఎక్కడ అని ఆశ్చర్యపోతూ అడిగారు. మేము అప్పుడు ఒక కెమెరా పెట్టుకొని ఒక అయిదారుగురితో షూటింగ్ చేస్తున్నాము అని తెలిపాడు.