Pranav Preetham : ఈ కొత్త హీరో.. స్టార్ విలన్ తనయుడు అని తెలుసా? తల్లి కూడా నటి..

ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో ప్రణవ్ సాయి ప్రీతమ్ అని కొత్త హీరో పరిచయం అయ్యాడు.

Pranav Preetham : ఈ కొత్త హీరో.. స్టార్ విలన్ తనయుడు అని తెలుసా? తల్లి కూడా నటి..

Prabuthwa Junior Kalashala Hero Pranav Sai Preetham Father Actor Madhusudhan Rao Goes Viral

Pranav Preetham : నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ఒకటి. ఇంటర్ లవ్ స్టోరీతో క్యూట్ గా, ఎమోషనల్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రణవ్ సాయి ప్రీతమ్ అని కొత్త హీరో పరిచయం అయ్యాడు. ప్రణవ్ గతంలో చాలా షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. షార్ట్ ఫిలిమ్స్ తో సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమాతో పరిచయం అయ్యాడు.

అయితే ప్రణవ్ సాయి ప్రీతమ్ తండ్రి స్టార్ విలన్. నటుడు మధుసూదన్ రావు కొడుకే ఈ ప్రణవ్ ప్రీతమ్. మధుసూదన్ రావు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మెప్పించారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన నటుల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు మధుసూధన రావు.

Also Read : Bosco Martis – NTR : ‘దేవర’ కోసం బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్.. షూట్ లొకేషన్ నుంచి ఎన్టీఆర్‌తో ఫోటో లీక్..

మధుసూదన్ రావు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా రిలీజ్ కి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి చెప్పాడు. అలాగే ఈ సినిమా ఈవెంట్లో కూడా హాజరయి కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు మధుసూదన రావు. నిన్న సినిమా రిలీజ్ అవ్వడంతో ప్రణవ్ తో పాటు ప్రణవ్ తండ్రి ఈయనే అంటూ వైరల్ అవుతున్నారు. ప్రణవ్ కూడా తన సోషల్ మీడియాలో గతంలో తండ్రితో దిగిన పలు ఫోటోలను షేర్ చేసాడు.

View this post on Instagram

A post shared by KANNAYYA (@pranavsai_preetham)

ఇక మధుసూదన్ రావు భార్య, ప్రణవ్ తల్లి కూడా నటిగా పలు సినిమాలు, సీరియల్స్ చేసింది. మొగలిరేకులు ఫేమ్ శృతి, మధుసూదన్ రావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శృతి కూడా సీనియర్ నటిగా ప్రస్తుతం పలు సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా ప్రణవ్ ఇప్పుడు హీరో అయ్యాడు. అయితే గతంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన ప్రణవ్ సినిమా టెక్నికల్ కోర్సులు కూడా నేర్చుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కొత్త హీరో స్టార్ విలన్ మధుసూదన్ రావు తనయుడు అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.