Brahmaji Interesting Tweet on Naveen Polishetty
Brahmaji : యువ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) వరుస సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. చాలా ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, షార్ట్ ఫిలిమ్స్, పలు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా హిట్ కొట్టి ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో భారీ విజయం సాధించి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నవీన్ ట్యాలెంటెడ్ యాక్టర్ కావడంతో అందరూ అతన్ని ఇష్టపడుతున్నారు.
సోషల్ మీడియాలో అభిమానులు చేసిన ట్వీట్స్ కి నవీన్ అప్పుడప్పుడు రిప్లై ఇస్తుంటాడు. తాజాగా ఓ అభిమాని నవీన్ కెరీర్ మొదట్లో ఇంజనీరింగ్ గురించి చెప్పిన వీడియోని, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఇంజనీరింగ్ గురించి చెప్పిన వీడియోని షేర్ చేస్తూ.. నార్త్ టు సౌత్ నవీన్ పోలిశెట్టి ఇంజనీరింగ్ కి వాయిస్ లా నిలిచాడు నవీన్ పోలిశెట్టి అని ట్వీట్ చేశారు. ఈ వీడియోని రీ షేర్ చేస్తూ నవీన్ పోలిశెట్టి.. ఇంజనీర్స్ అసెంబుల్.. అదే కదండీ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
Also Read : Ravi Teja : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. తెలుగు క్రికెట్ లైవ్ కామెంటరీ ఇచ్చిన హీరో రవితేజ
అయితే ఈ వీడియోని నటుడు బ్రహ్మజీ కూడా రీ షేర్ చేసి.. ఈ అబ్బాయి ట్యాలెంట్ చూస్తే నాకు భయమేస్తుంది. ఇంకా నేను రిటైర్ అయిపోవడం బెటర్ అని సరదాగా ట్వీట్ చేశాడు. దీనికి నవీన్ పోలిశెట్టి రిప్లై ఇస్తూ.. మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది.. ఇద్దరం కలిస్తే అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో బ్రహ్మాజీ- నవీన్ పోలిశెట్టి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్రహ్మజీ కూడా ఎప్పుడూ సరదాగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే.
Ee abbayi talent chusthe naaku bhayamesthundi..ika Nenu retire ayipothe better..🙏🏼🙏🏼🙏🏼 https://t.co/3xQY0hgw1f
— Brahmaji (@actorbrahmaji) October 8, 2023
Meeku power undi maaku brain undi ….manidram kaliste 😜 🙏❤️
— Naveen Polishetty (@NaveenPolishety) October 8, 2023