Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. అసలు ఏమైంది..?

రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు. సినీ నిర్మాతకు నోటీసులు జారీ చేస్తూ..

case filed on raviteja Tiger Nageswara Rao in AP high court

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజతో (Raviteja) కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. 19’s కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి ఒక టీజర్ రిలీజ్ అయ్యింది. రవితేజ అభిమానులకి ఈ ట్రైలర్ బాగా నచ్చేసింది. అయితే ఈ టీజర్ పై ఏపీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

Varun Tej : నిర్మాతల కోసం వరుణ్ తేజ్ గొప్ప నిర్ణయం.. గ్రేట్ అంటున్న అభిమానులు..

ఎరుకల సామాజికవర్గ మనోభావాలను, స్టువర్టుపురం గ్రామప్రజల ప్రతిష్ఠని కించపరిచేలా టైగర్‌ నాగేశ్వరరావు సినిమా చిత్రీకరణ జరుగుతుందని చుక్కా పాల్‌రాజ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ఇక ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సినిమా టీజర్ లో ఒక సామాజిక వర్గాన్ని మరియు స్టువర్టుపురం ప్రాంతంలో నివసించే వారిని అవమానపరిచేలా ఉందంటూ వ్యాఖ్యానించింది. అసలు సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ని ఎలా రిలీజ్ చేశారు? ఇలాంటి టీజర్ తో సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించింది.

Vijay Deverakonda : పోకిరి సినిమాలో మాదిరి నా మూవీలో కూడా.. ఫ్యాన్స్ ఆ పని చేయొద్దు..

ఈక్రమంలోనే సినీ నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. అలాగే పిటిషన్ లో సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఛైర్‌పర్సన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలంటూ పిటిషనర్‌కు సూచించింది. దీంతో టైగర్ నాగేశ్వరరావు నిర్మాతలకు చుక్క ఎదురైనట్లు అయ్యింది. మరి దీనిని నిర్మాతలు ఎలా ఎదుర్కొంటారో? చూడాలి. కాగా ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ భామలు నుపూర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుంటే రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు