Sir Movie Trailer: ధనుష్ ‘సార్’ ట్రైలర్.. సోషల్ మెసేజ్‌కు మాస్ టచ్..!

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ధనుష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Sir Movie Trailer: తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ధనుష్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగునాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

SIR Movie: బంజారా సాంగ్‌తో వస్తున్న ధనుష్ ‘సార్’!

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఓ సోషల్ మెసేజ్ మూవీగా ఈ సినిమా రాబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ధనుష్ మార్క్ మాస్ ఎలివేషన్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనుందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక ధనుష్ పాత్ర ఈ సినిమాను ఇటు క్లాస్ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దారు. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకునేందుకు వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు