Mrunal Thakur : ఆ హీరోని కొట్టడానికి భయపడ్డాను అంటున్న మృణాల్.. ఎవరు ఆ హీరో..?
ఆ హీరోని కొట్టడానికి చాలా భయపడ్డాను అంటున్న మృణాల్. ఇంతకీ ఎవరు ఆ హీరో..?
- gum 95921
- Published On : April 26, 2024 / 09:04 AM IST
Mrunal Thakur is scared to slap Shahid Kapoor during Jersey movie
Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ తెలుగులో కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటించి సూపర్ స్టార్‌డమ్ ని సంపాదించుకున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో నటించారు. కాగా మృణాల్ రీసెంట్ గా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో గురించి, అలాగే ఆ హీరోని కొట్టడానికి తాను పడిన భయం గురించి కామెంట్స్ చేసారు.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి మృణాల్ ‘జెర్సీ’ రీమేక్ లో నటించిన విషయం తెలిసిందే. మృణాల్ కి షాహిద్ అంటే చాలా ఇష్టమంట. ఆ సినిమా చేస్తున్న సమయంలో షాహిద్ తో ప్రేమలో పడిపోయి చాలా చనువుగా ఉండేదని అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో షాహిద్ ని చెంపదెబ్బ కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ చేయడానికి మృణాల్ చాలా బయపడ్డారట.
Also read : Sreeleela : ఆ స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్.. అప్పుడేనా..?
తాను ఇష్టపడే వ్యక్తిని కొడితే, అతను ఏం అనుకుంటాడో అని తెగ బయపడిపోయారట. ఆ భయంతోనే ఆ సీన్ చేశారట. కాగా తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ.. బాలీవుడ్ లో మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయింది. హిందీ రీమేక్ ని కూడా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే డైరెక్ట్ చేసారు.
ఇక మృణాల్ సినిమాలు విషయానికి వస్తే.. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ అంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చారు మృణాల్. కానీ వీటి తరువాత ఇప్పటివరకు మరో సినిమాకి సైన్ చేయలేదు. బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఒక సినిమానే చేస్తున్నట్లు సమాచారం. మరి మృణాల్ తన కొత్త ప్రాజెక్ట్స్ పై అప్డేట్ ని ఎప్పుడు ఇస్తారో చూడాలి.
