Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు, కమర్షియల్ యాడ్స్ లో కూడా ప్రత్యేకత చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు. యాడ్స్ లో ఒక స్టోరీని చూపిస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. తాజాగా రామ్ చరణ్ నుంచి ఒక కొత్త యాడ్ వచ్చింది. ఆ యాడ్ లో నాన్న కథని, నాన్న ప్రేమని చూపించి ఎమోషనల్ చేస్తున్నాడు. ‘మాన్యవర్’ అనే బట్టలు సంస్థ కోసం చరణ్ ఈ కొత్త యాడ్ చేశాడు.
“నాన్న అడుగులో అడుగు వేస్తూ చాలా నేర్చుకున్నాను. ఆయనని చూసే పనిలో పట్టుదలతో ఉండాలని నేర్చుకున్నాను. మనల్ని ప్రేమించే వారిని మనకన్నా ఎక్కువ ప్రేమించాలని నేర్చుకున్నాను. తన గురించి ఆలోచనని వారికోసం ఆలోచిందడం నాన్నని చూసే నేర్చుకున్నాను, జీవితంలో నిలబడానికి నాన్నని చూసే నేర్చుకున్నాను” అంటూ రామ్ చరణ్ ప్రతి ఒక్క నాన్న కొడుకుల కథని ఒక చిన్న యాడ్ లో చూపించేశాడు. మరి ఆ ఎమోషనల్ యాడ్ ని మీరు కూడా చూసేయండి.
Also read : Ram Charan : ఇటలీ బయలుదేరిన రామ్ చరణ్ జంట.. వరుణ్ తేజ్ పెళ్లి పనులు కోసమేనా..?
ఈ యాడ్ ని తెలుగు, హిందీలో భాషల్లో ప్రసారం చేయబోతున్నారు. ఇక ఈ యాడ్ చూసిన అభిమానులు.. చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. తండ్రిగా చిరంజీవి కనిపించి ఉంటే ఇంకా అదిరిపోయేది అంటూ మరికొందరు అభిమానులు తమ ఆశని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రామ్ చరణ్ నేడు ఇటలీ బయలుదేరాడు. వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో భాగంగా చరణ్ అండ్ ఉపాసన అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పనులను రామ్ చరణ్, ఉపాసన చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరగనుందని టాక్ వినిపిస్తుంది. ఈక్రమంలోనే అక్కడ పనులు అన్ని చూసుకోవడాని రామ్ చరణ్ జంట ముందుగానే అక్కడికి వెళ్లినట్లు సమాచారం.