Hero Trailer: ‘హీరో’ తొలి సినిమా కష్టాలకు తోడైన ప్రేమ!

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ

Hero Trailer: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతోన్న మూవీ ‘హీరో’. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

Star Couples: అంతా మా ఇష్టం.. రెచ్చిపోతున్న హాట్ కపుల్స్!

దర్శకధీరుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశాడు. విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్నీఅంశాలను ప్రధానంగా తీసుకుని చిత్ర ట్రైలర్ ని కట్ చేశారు మేకర్స్. జగపతిబాబు, సీనియర్ నటుటు నరేశ్, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా.. యాక్షన్ సన్నివేశాల కోసం బాగానే ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.

Parasuram: మహేశ్ దర్శకుడి భారీ స్కెచ్.. ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్!

ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటినుంచి హీరో అవ్వాలనుకొనే ఒక కుర్రాడు.. అతడికి సపోర్ట్ చేసే తల్లి, తిరస్కరించే తండ్రి.. వీరి మధ్యలో నలిగిపోతూనే హీరో వేషాల కోసం తిరుగుతూ ఉండే కుర్రాడికి పక్కింట్లో అద్దెకుండే హీరోయిన్ పరిచయం.. ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి హీరోయిన్ తండ్రితో గొడవ.. వీరి మధ్యలోకి దిగిన మాఫియా. కథ కొంచెం కామన్ గా ఉన్నా శ్రీరామ్ ఆదిత్య టేకింగ్ కొత్తగా ఉంది.

Pushpa: తగ్గేదేలే.. రూ.100 కోట్ల వైపు పుష్ప బాలీవుడ్ కలెక్షన్లు!

మధ్యలో కౌ బాయ్ గా హీరోని చూపించి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబును గుర్తుచేశారు. గిబ్రాన్ మ్యూజిక్ ట్రైలర్ కి ప్లస్ కాగా.. నిధి అందాలు, హీరోతో లిప్ కిస్సులు చూపించి రొమాంటిక్ యాంగిల్ ఉన్నట్లు చూపించారు. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్ మిక్స్ చేసి చూపించిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుంది. మరి జనవరి 15న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు